మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టులో విచారణ

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 05:39 PM IST
మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టులో విచారణ

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయన్నారు ఏజీ. మండలిలో సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. అయితే బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. 

విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని, విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్‌ భాన్‌ కోరారు. దీనిపై స్పందించిన సీజే.. విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు.   

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై  హైకోర్టులో విచారణ జరిగింది. సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకూ కోర్టు ఎలాంటి తీర్పూ ఇవ్వబోదని.. ఎంపీ కేశినేని నాని తెలిపారు.. అసెంబ్లీలో పాసైన బిల్లు మండలిలో తిరస్కారంపైనే వాదోపవాదనలు జరిగాయన్నారు.