విరాళాలపై ఇంటెలిజెన్స్ ఆరా : రవిప్రకాశ్ సంజీవని ఆస్పత్రిలో అక్రమాలపై విచారణ

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలతో అక్రమాల డొంక కదులుతోంది. విరాళాలు పక్కదారి పట్టినట్టు అనుమానాలు

  • Published By: veegamteam ,Published On : October 10, 2019 / 10:18 AM IST
విరాళాలపై ఇంటెలిజెన్స్ ఆరా : రవిప్రకాశ్ సంజీవని ఆస్పత్రిలో అక్రమాలపై విచారణ

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలతో అక్రమాల డొంక కదులుతోంది. విరాళాలు పక్కదారి పట్టినట్టు అనుమానాలు

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలతో అక్రమాల డొంక కదులుతోంది. విరాళాలు పక్కదారి పట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విరాళాల సేకరణకు అప్పట్లో…ఇద్దరు తానా మాజీ అధ్యక్షులు సహకరించినట్లు తెలుస్తోంది. అలాగే.. విజయవాడకు చెందిన లెదర్ పరిశ్రమ యజమాని కూడా సహకరించినట్లు సమాచారం. రవిప్రకాశ్‌, కూచిబొట్ల ఆనంద్‌కు సహకరించిన వారిపై ఇంటెలిజెన్స్‌ ఆరా తీస్తోంది. పేదలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యమన్నందుకే తాము విరాళాలు ఇచ్చామని దాతలు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే సంజీవనిపై విచారణ మొదలుపెట్టారు ఆర్డీవో. ఆస్పత్రి స్థలం, సేకరించిన విరాళాలు, అనుమతులపై రిపోర్ట్‌ ఇవ్వాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మరోవైపు నిధుల దుర్వినియోగం, విరాళాలపై ఇంటెలిజెన్స్‌ నివేదిక సిద్ధం చేస్తోంది. 

సంజీవని ఆసుపత్రి విరాళాల గుట్టు బయటపడనుంది. ధర్మాసుపత్రి అయినప్పటికీ పేదల నుంచి వైద్యానికి డబ్బులు వసూలు చేయడంపైనా ఆర్డీవో దృష్టి పెట్టనున్నారు. ఆస్పత్రి ప్రారంభమై ఏడాది దాటిపోయినా ఇన్‌ పేషెంట్‌ విభాగం ఎందుకు అందుబాటులోకి రాలేదు? అంబులెన్సులు ఎందుకు కొనలేదు..? అన్నది కూడా విచారించనున్నారు. రవిప్రకాశ్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి విరాళాలు, మోసాలను బయటపెట్టాలని, తామిచ్చిన విరాళాలు ఏమయ్యాయో తేల్చాలని కూచిపూడి వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిధుల దుర్వినియోగం, స్థలం ఎవరిది, ఆస్పత్రికి అనుమతులకు సంబంధించి పూర్తి రిపోర్టు ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించామని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. కూచిపూడి ప్రాంతంలో నిర్మించిన సిలికానాంధ్ర సంజీవని హాస్పిటల్‌ దాతల విరాళంతో కట్టారని తమకు సమాచారం ఉందన్నారు. ధర్మాసుపత్రి పేరుతో విరాళాలు సేకరించడం, దాతలు ఇచ్చిన సొమ్ముతో భూముల్ని కొని వాటిని సొంతానికి వాడుకోవడంపై విచారణ జరపనున్నారు. 

రవిప్రకాశ్‌ సిలికానాంధ్ర ఆసుపత్రి వ్యవహారంపై ఇంటెలిజెన్స్‌ కూడా దృష్టిపెట్టింది. ఎంత మొత్తంలో నిధులు సేకరించారు, ఎవరెవరు విరాళాలు ఇచ్చారు…? వాటిని ఏం చేశారు అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తోంది. కూచిపూడి పరిసర ప్రాంతాల్లోని 150 గ్రామాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించనున్నాయి. అంతేకాదు పేదలకు వైద్యం పేరిట నిర్మించిన ఆసుపత్రిలో అసలు వారికి వైద్యం అందకపోవడంపైనా దృష్టి పెట్టింది. ఆసుపత్రిలో వైద్యం అందక మరణించిన వారి వివరాలనూ సేకరిస్తోంది. నిధుల దుర్వినియోగం, విరాళాల సేకరణపై నివేదికను సిద్ధం చేస్తోంది.