ఇంటర్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్: ఆందోళనలో విద్యార్థులు

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 07:19 AM IST
ఇంటర్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్: ఆందోళనలో విద్యార్థులు

సత్తెనపల్లి  : గుంటూరు జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టిస్తోంది. సత్తెనపల్లిలో  పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటంతో శాంతినికేతన్ కాలేజీపై అనుమానాలు రేగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు.  పరీక్షలు జరిగే అన్ని సెంటర్స్ లోను తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా శాంతినికేతన్ కాలేజ్ లో తనిఖీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. .

 
శాంతినికేతన్ కాలేజీకి సమీపంలోని ఓ జిరాక్స్ సెంటర్ లో  జిరాక్స్ తీయిస్తుండగా..చూసిన ఓ వ్యక్తి, పోలీసులకు ఈ విషయాన్ని ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ క్వశ్చన్ పేపర్ ను స్వాధీనం చేసుకుని..కేసు నమోదు చేశారు. ఈ పేపర్ లీక్ పై విచారణ జరుపుతున్నామని.. ఎవరు బయటకు తెచ్చారో తేలుస్తామని అన్నారు.ఈ అంశంపై ఇంటర్ బోర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాట్లాడుతు..గతంలో ఎప్పుడు ఇటువంటి సందర్భాలు జరగలేదనీ ఇదే మొదటి సారని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ఆర్ ఐవో తో పాటు పదిమంది మంది బృందం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారనీ..సెట్ నంబర్ 2ను లాంచ్ చేశామనీ నిందితులు ఎంతటివారైనా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా మార్చి 12తో ఇంటర్ పరీక్షలు ముగియనుండటంతో  కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటంతో విద్యార్థులు కాలేజ్ వద్ద ఆందోళన చేపట్టారు.