కాపీ కొడుతూ దొరికి బిల్డింగ్ పై నుండి దూకేసింది

  • Published By: vamsi ,Published On : February 28, 2019 / 03:08 AM IST
కాపీ కొడుతూ దొరికి బిల్డింగ్ పై నుండి దూకేసింది

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరిక్షలు బుధవారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు పరిక్షలు రాస్తున్నవేళ విద్యాశాఖ మాస్ కాపీయింగ్ పాల్పడకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో హన్మకొండలోని నయీంనగర్‌లో గల ఆర్‌డీ కళాశాలలో పోలసాని రక్షరావు (16) అనే విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడుతుండగా కాలేజీ సిబ్బంది గుర్తించింది. ఆమెను పట్టుకుని మందలించారు.

దీంతో అవమాన భారానికి గురైన విద్యార్ధిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే గమనించిన కాలేజీ సిబ్బంది తీవ్ర గాయాలపాలైన రక్ష రావును ఆస్పత్రికి తరలించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొదటిరోజు ఇంటర్ పరిక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ బోర్డు తమ విద్యార్థుల కోసం 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా విద్యార్ధులు మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.