పంజాబ్ మ్యాచ్‌లో పొలార్డ్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవే!

  • Published By: vamsi ,Published On : October 19, 2020 / 03:18 AM IST
పంజాబ్ మ్యాచ్‌లో పొలార్డ్ క్రియేట్ చేసిన రికార్డులు ఇవే!

MI vs KXIP IPL 2020: ఐపీఎల్ 36 వ మ్యాచ్‌లో పొలార్డ్ పంజాబ్‌పై చిన్న తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో వచ్చి 12బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు సాయంతో 34పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో అతను కొట్టిన అద్భుతమైన నాలుగు సిక్సర్లు సురేష్ రైనా, రోహిత్ శర్మలను వెనుకకు నెట్టి ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు పోలార్డ్.



పంజాబ్‌పై మొదటి ఇన్నింగ్స్ ముగింపులో కిర్రాన్ పొలార్డ్ అద్భుతంగా ఆడాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 283.33. పొలార్డ్ ఇప్పుడు ఐపిఎల్‌లో పంజాబ్‌పై మొత్తం 39 సిక్సర్లు సాధించిన రికార్డు క్రియేట్ చేశాడు. సురేష్ రైనాను వెనక్కి నెట్టి.. పంజాబ్‌పై గరిష్ట సిక్సర్ల పరంగా రైనా మూడో స్థానంలో ఉండగా.. పొలార్డ్ అతన్ని అధిగమించి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్.



క్రిస్ గేల్ – 61
ఎబీ డివిలియర్స్ – 42
కిరోన్ పొలార్డ్ – 39
సురేష్ రైనా – 35

ఐపీఎల్‌లో పొలార్డ్ చివరి ఓవర్‌లో సిక్సర్లు కొట్టే విషయంలో రెండవ స్థానంలో నిలిచాడు. పోలార్డ్ పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మను రికార్డును బద్దలు కొట్టాడు. ఈ లీగ్‌లో పొలార్డ్ 20వ ఓవర్‌లో ఇప్పటివరకు మొత్తం 26 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ 23 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదే సమయంలో, 20 వ ఓవర్లో మొత్తం 49 సిక్సర్లు కొట్టి ఎంఎస్ ధోని ముందు వరుసలో ఉన్నాడు.



ఐపీఎల్‌లో 20 వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్లు:

49 – ఎంఎస్ ధోని
26 – కిర్రాన్ పొలార్డ్
23 – రోహిత్ శర్మ

ఇక ఐపీఎల్ 13వ సీజన్ విషయానికి వస్తే.. పొలార్డ్ నికోలస్ పూరన్‌తో కలిసి 36వ మ్యాచ్ వరకు గరిష్ట సిక్సర్ల పరంగా రెండవ స్థానంలో నిలిచాడు. సంజు శాంసన్, డివిలియర్స్ సంయుక్తంగా గరిష్ట సిక్సర్ల పరంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఇద్దరూ 19-19 సిక్సర్లు కొట్టారు.



ఐపీఎల్ 2020- 36 వ మ్యాచ్ వరకు అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్ మెన్లు:

సంజు శాంసన్ – 19
ఎబీ డివిలియర్స్ – 19
కిరోన్ పొలార్డ్ – 17
నికోలస్ పురాన్ – 17
రాహుల్ టియోతెవాటియా – 16