మూడు జిల్లాల్లో జగన్ పర్యటన 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  

  • Published By: chvmurthy ,Published On : March 18, 2019 / 06:05 AM IST
మూడు జిల్లాల్లో జగన్ పర్యటన 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  

అమరావతి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  ఆదివారం మూడు జిల్లాల్లో  సుడిగాలి పర్యటన చేపట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోమవారం కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

సోమవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన మొదట కర్నూలు జిల్లా పాణ్యం నియోజక వర్గంలోని ఓర్వకల్లులో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పాణ్యం నియోజక వర్గంలో రోడ్ షో లో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలు దేరి మధ్యాహ్నం అనంతపురం జిల్లా  రాయదుర్గం చేరుకుంటారు.  అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 
Read Also : జగన్‌కు షాక్.. జనసేనలోకి నాగబాబు

సాయంత్రానికి కడప జిల్లా రాయచోటి చేరుకుని అక్కడ జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారు. మొదటి రోజు 3 సభల్లో పాల్గోన్న జగన్ 2వ రోజు కూడా 3 సభల్లో పాల్గోంటారు. 19, 20  తేదీల్లో కూడా మూడేసి సభల్లో పాల్గోనే జగన్ , 21 నుంచి 1వ తేదీ వరకు  రోజుకు 4 సభలు , 2నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు రోజుకు 5నుంచి 6 ప్రచార సభల్లో పాల్గోనేలా పార్టీ వర్గాలు ప్రణాళిక రూపోందిస్తున్నాయి. పాదయాత్ర లో కవర్ చేయని నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి మొదట జగన్ అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. తర్వాత మిగతా నియోజక వర్గాలు, కాస్త బలహీనంగా ఉన్న నియోజక వర్గాల్లో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. 
Read Also : స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి