‘లోటస్’ కూడా అక్కడే : కల్వకుంట్లలో జగన్ లోటస్ పాండ్

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 11:26 AM IST
‘లోటస్’ కూడా అక్కడే : కల్వకుంట్లలో జగన్ లోటస్ పాండ్

చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు వినూత్నరీతిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..జగన్ లోటస్ పాండ్ కల్వకుంట్లలో ఉందని, ఆ లోటస్ పాండ్ లో ‘లోటస్’ కూడా ఉంది, అంటే, ‘కమలం’ (బీజేపీ గుర్తు) అని, వైసీపీకి టీఆర్ఎస్, బీజేపీతో లాలూచీ ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని చంద్రబాబు విశ్లేషించారు. పెన్షన్ తీసుకనే ఒంటిరి మహిళను కొట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు పెన్షన్ రూ.3వేలు ఇస్తామంటు వస్తున్నారనీ..ఇటువంటి కోడి కత్తి పార్టీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు చంద్రబాబు. 
 

‘అది చేస్తా, ఇది చేస్తా’ నంటు  జగన్ కోతలరాయుడు కోతలు కోస్తున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ అంటే ఇప్పుడు ఎవరికీ తెలియడం లేదని ‘కోడికత్తి పార్టీ’ అంటేనే ఈజీగా అర్థం అవుతోందనీ చంద్రబాబు జగన్ పై సెటైర్లు విసిరారు. లోటస్ పాండ్ లో కూర్చుని జగన్ కుట్రలు చేస్తున్నారని..కేసీఆర్, మోడీలతో పొత్తులు పెట్టుకుని ఏపీ ప్రజలపై ఒకవైపు కుట్రలు పన్నుతునే మరోవైపు ఓట్లు అడిగేందుకు వస్తున్నాడనీ..ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్ కు లేదన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును  దోచుకుని ఆస్తులు కూడబెట్టుకుని ఆ ఆస్తుల్ని కాపాడుకుంటూ కేసీఆర్ ఊడిగం చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు కేసుల్ని మాఫీ చేయించుకునేందుకు మోడీ కాళ్లు పట్టుకుంటున్నాడనీ  విమర్శించారు చంద్రబాబు.