జయరామ్ కేసు : నందిగామకు రాకేశ్ రెడ్డి 

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 09:16 AM IST
జయరామ్ కేసు : నందిగామకు రాకేశ్ రెడ్డి 

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త,ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో జయరాంను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని నందిగామ వరకూ ఏ విధంగా తీసుకెళ్లారన్న దానిపై పూర్తి ఆధారాలను తెలుసుకోనున్నారు. ఇప్పటికే రాకేశ్ రెడ్డి ఇంట్లో సీన్ రీ కన్సట్రక్షన్ చేసిన హైదరాబాద్ పోలీసులు…నందిగామలో జయరాం మృతదేహం దొరికిన ప్రాంతానికి రాకేశ్ రెడ్డిని  తీసుకెళ్లి మరిన్ని ఆధారాలు సేకరించనున్నారు.
 

జయరాం హత్య తర్వాత రాకేశ్ రెడ్డి ఏఏ ప్రదేశాలలో ఆగాడు..ఎందుకు ఆగాడు..ఈ క్రమంలో ఎవరినైనా కలిశాడా..ఎవరెవరితో మాట్లాడాడు..వంటి అంశాలపై ఆరా తీయనున్నారు. జయరాం హత్య కేసులో రాకేశ్‌తో పాటు మరికొందరికి ప్రమేయం ఉండే అవకాశం ఉందని పోలీసుల భావిస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే 50 మంది అనుమానితులను విచారించారు. మరో ఇద్దరు నిందితులను కూడా గుర్తించారు. ఈ క్రమంలో రాకేశ్ ను నందిగామ తీసుకెళ్లటంతో మరిన్ని అంశాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసు రాజకీయ నేతల హస్తం కూడా ఉందని రాకేశ్ రెడ్డి తెలిపాడనీ..ఈ కేసు మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.