Home » Uncategorized » ఎన్నికలపై కసరత్తు : పవన్‌తో లెఫ్ట్ లీడర్లు
Publish Date - 10:26 am, Fri, 25 January 19
By
madhuవిశాఖపట్టణం : రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసేనానీ వ్యూహాలకు మరింత పదును పెంచారు. లెఫ్ట్ వారితోనే రైట్ అన్న పవర్ స్టార్..వారితో చర్చలను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా జనవరి 25వ తేదీ శుక్రవారం విశాఖలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు రాఘవులు, సురవరం నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ భేటీ అయ్యారు. ప్రజా సమస్యలపై పేరిట ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో లెఫ్ట్ పార్టీల కీలక నేతలతో పాటు..జనసేన నేతలు కూడా పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో చర్చించినట్లు భేటీ అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించారు. అంతేగాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై ఫిబ్రవరి మాసంలో ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ వెల్లడించారు. ఈవీఎంల టాంపరింగ్ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చిందని పవన్ వెల్లడించారు.
జనసేనాని కోసం అభిమానుల పూజలు
Tollywood : లేటెస్ట్ 30 ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్..
Vakeel Saab : ‘వకీల్ సాబ్’ ఘనవిజయం మా బాధ్యత మరింత పెంచింది – నిర్మాత దిల్ రాజు..
Jana sena Glass symbol: జనసేనకి ఊహించని ఎదరుదెబ్బ.. సింబల్ పోయింది
Tollywood: ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ టాలీవుడ్ 30 అప్డేట్స్..
Pawan Kalyan Corona : పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్