గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ

గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ

గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కన్ఫామ్ అయ్యింది. విశాఖపట్నం జిల్లా నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆయన.. గాజువాక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ పవన్ కల్యాణ్ గెలుపు ఈజీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు లక్ష సభ్యత్వాలు ఉన్నాయి. యువత కూడా ఎక్కువ. ఇదే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరికొన్ని గంటల్లోనే చెబుతాం అంటోంది జనసేన.
Read Also : గుంటూరు వెస్ట్ అసెంబ్లీ బరిలో హీరోయిన్

ఇప్పటి వరకు టీడీపీ గాజువాక అభ్యర్థిని ప్రకటించలేదు. ఇది టీడీపీ సిట్టింగ్ స్థానం. అయినా తెలుగుదేశం పార్టీ ప్రకటించకపోవటం విశేషం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. పవన్ కల్యాణ్ గాజువాక నుంచి బరిలోకి దిగితే.. టీడీపీ క్యాండిడేట్ ఎవరు అనేది మాత్రం ఆసక్తిగా మారింది.

×