క‌రోనా నుంచి కోలుకున్న వారంతా ప్లాస్మా దానానికి ముందుకు రావాల‌ి : జార్ఖండ్ సీఎం

  • Published By: nagamani ,Published On : July 28, 2020 / 04:20 PM IST
క‌రోనా నుంచి కోలుకున్న వారంతా ప్లాస్మా దానానికి ముందుకు రావాల‌ి : జార్ఖండ్ సీఎం

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్లాస్మా డొనేష‌న్ కేంద్రాన్నిమంగ‌ళ‌వారం (July 28,2020) ప్రారంభించారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో ఏర్పాటు చేసి ప్లాస్మా డొనేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఈసందర్భాగా క‌రోనా నుంచి కోలుకున్న ప‌లువురు ప్లాస్మాను దానం చేశారు. సీఎం హేమంత్ సోరెన్ వారిని అభినందించారు. క‌రోనా నుంచి కోలుకున్న వారంతా ప్లాస్మా దానానికి ముందుకు రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. దీంతో వైర‌స్ బారిన ప‌డిన వారు కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,200 దాటింది. వైర‌స్ సోకిన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు 85 మంది చ‌నిపోయారు. ప్లాస్మా దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని..తద్వారా ప్లాస్మా దానానికి ముందుకు రావాల్సిన అవసరముందని ఆయన కోరారు.

కాగా..గత 24 గంటల్లో భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 14.83 లక్షలకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం తెలిపింది.నిన్నటి నుండి 654 కోవిడ్ -19 రోగులు మరణించారని, మొత్తం కోవిడ్-లింక్డ్ మరణాలు 33,425. ఇప్పటివరకు 9.5 లక్షలకు పైగా రోగులు కోలుకున్నారు మరియు దేశ పునరుద్ధరణ రేటు ఈ ఉదయానికి 64.23 శాతంగా ఉందని తెలిపింది.