బోటు ప్రమాదం : రమ్య ఎక్కడమ్మా

పాపికొండల విహారయాత్రకు వెళ్తూ.. గతనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఇంకా నలుగురు ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

బోటు ప్రమాదం : రమ్య ఎక్కడమ్మా

పాపికొండల విహారయాత్రకు వెళ్తూ.. గతనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా కొట్టిన ఘటనలో ఇంకా నలుగురు ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రమ్య కుటుంబసభ్యులు కడసారి చూపుకోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. హజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన సుదర్శన్ – భూ లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్య. రమ్య. బీటెక్ పూర్తి చేసి కొమరంభీం ఆసిఫాబాధ్ జిల్లాలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించింది. సెప్టెంబర్ 15వ తేదీ పాపికొండల పర్యటనకని రమ్య..తన స్నేహితులతో బయలుదేరింది. బోటు ప్రమాదంలో రమ్య కూడా మునిగిపోయింది. 39 రోజులవుతున్నా..ఆమె ఆచూకీ తెలియడం లేదు. కన్నబిడ్డ జాడ లభించకపోవడంతో..ఆమె కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.

కానీ అయితే. తమ వారి ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెలికితీసిన ఎనిమిది మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. గుర్తు పట్టడానికి వీలు లేకుండా మృతదేహాలున్నాయి. మృతులకు ఉన్న దుస్తుల ఆధారంగా బంధువులు గుర్తించనున్నారు. గుర్తించ లేని పక్షంలో డిఎన్ఏ టెస్ట్ లకు పంపించనున్నారు. మృత దేహాలు వచ్చాయని తెలిసి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ బంధువులు వచ్చారు. తీసిన బోటులో రమ్య మృతదేహం లేకపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. పడవను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే..ఏమైనా ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఇప్పటి వరకు 46 మృతదేహాలు లభ్యమయ్యాయి. 38 మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

పర్యాటకుల కేరింతలు, కళకళలతో కదిలి వెళ్లిన బోటు… శిథిలమై, శకలమై, కకావికలమై మళ్లీ కనిపించింది! 38 రోజుల జల‘సమాధి’ నుంచి ఎట్టకేలకు బయటపడింది. 51 మందిని బలి తీసుకుని… గోదావరితోనే కన్నీరు పెట్టించిన దుర్ఘటనకు సాక్షీభూతంలా నిలిచింది. సిబ్బంది, పర్యాటకులతో కలిపి 77 మందితో పాపికొండల విహార యాత్రకు బయలుదేరిన ‘రాయల్‌ వశిష్ట’ సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం గోదావరి వరద సుడిలో చిక్కుకుని మునిగి పోయింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం నుంచి 26 మంది మాత్రమే సజీవంగా బయటపడ్డారు. గోదావరి గర్భంలో చేరిన బోటును బయటికి లాగేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు… కాకినాడకు చెందిన మత్స్యకారుడు ధర్మాడి సత్యం బృందం విజయవంతంగా బోటును బయటికి లాగింది.
Read More : వెదర్ అప్ డేట్ : కోస్తాకు అతి భారీ వర్ష సూచన