బోటు దగ్గరకు వెళ్లిన డీప్ సీ డైవర్స్ : కచ్చులూరు వద్ద మరో డెడ్ బాడీ

  • Published By: madhu ,Published On : October 20, 2019 / 09:56 AM IST
బోటు దగ్గరకు వెళ్లిన డీప్ సీ డైవర్స్ : కచ్చులూరు వద్ద మరో డెడ్ బాడీ

కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులు కంటిన్యూ అవుతున్నాయి. గత నెల రోజుల నుంచి దశలవారీగా ఈ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ధర్మాడి టీం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బోటును పక్కాగా తీస్తామని చెబుతున్నారు. కానీ బోటును తీసే క్రమంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. రోప్, యాంకర్లు బిగించడం కష్టసాధ్యమౌతోంది. ఇటీవలే బోటుకు సంబంధించిన రెయిలింగ్ బయటకు వచ్చింది. దీంతో బోటు వెలికితీస్తారని ఆశలు ఎక్కువయ్యాయి. నదిలోకి వెళ్లి..బోటును యాంకర్స్ బిగించాలంటే స్కూబా డైవర్స్‌తో సాధ్యమని ధర్మాడి భావించారు. విశాఖపట్టణంలో వారితో సంప్రదింపులు జరిపారు. 

అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఇద్దరు డైవర్స్ మాస్క్‌లు, గ్యాస్ సిలిండర్లు ధరించి నదిలోకి వెళ్లారు. బోటు మునిగిన ప్రాంతాన్ని గుర్తించారు. బోటు తిరగబడి ఉండవచ్చునని, యాంకర్లు, రోప్ వేయడం..వెలికి తీయడం కష్టసాధ్యమని డైవర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ..వారు మాత్రం ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. రెండింటిని తగిలిస్తే..మాత్రం బోటు తప్పకుండా బయటకు వస్తుందని ధర్మాడి టీం భావిస్తోంది. 

ఇదిలా ఉంటే..కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయటపడింది. బ్లాక్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉంది. బోటు ప్రమాదంలో మరణించిన వ్యక్తిగా యోచిస్తున్నారు. కానీ..మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో, తల లేకుండా ఉండడంతో గుర్తుపట్టడం కష్టసాధ్యమౌతోంది. 

సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Read More : అవమాన భారంతో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య