డేంజర్ కెనాల్: ప్రాణాలు పోతున్నా..పట్టించుకోని అధికారులు  

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 07:08 AM IST
డేంజర్ కెనాల్: ప్రాణాలు పోతున్నా..పట్టించుకోని అధికారులు  

ఉరకలేసే నీటిని చూస్తే ఎవ్వరైనా సరే మైమరచిపోతారు. ఆ నీటిలో ఊత కొట్టాలని ఉబటాపడతారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాలు తీయొచ్చు. అటువంటి ప్రమాదాలకు కేంద్రంగా మారింది కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కెనాల్. సరదాగా ఎంజాయ్ చేద్దామని ఈ కాకతీయ కెనాల్ లోకి దిగిన ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈత కొట్టేందుకు దిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా పలువురు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకూ వారి ఆచూకీ కూడా లభించలేదు. 

కాకతీయ కెనాల్ (కాలువ)లో ఉదృతంగా నీరు ప్రవహిస్తున్న సమయంలో దాంట్లో ఈత కొట్టేందుకు దిగి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కారణం ఈ కాలువ దగ్గర ఎటువంటి ప్రమాదాల హెచ్చరికల బోర్డు లేకపోవటం. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక..కాలువలోకి దిగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇన్ని ప్రాణాలో పోతున్న ఇప్పటి వరకూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

ఈ కాకతీయ కెనాల్ పొడవు 284 కిలో మీటర్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రహదారి వెంటనే ఆహ్లాదకరంగా ప్రవహించే ఈ కాలువ చూపరులను ఆకట్టుకుంటోంది. ఆహ్లాదంగా ఉండే ఈ కాలువ ప్రాణాల్ని హరిస్తోందంటే ఎవ్వరూ నమ్మరు. రైతన్నల సాగునీటి కష్టాల్ని తీర్చేందుకు ప్రభుత్వం 9700 క్యూసెక్కుల కెపాసిటీతో ఈ కాలువ నిర్మించింది. 

ప్రతీ ఏటా లోయర్ మానేరులో నీటి నిల్వ ఆధారంగా ఈ కాకతీయ కాలువకు నీటిని అధికారులు విడుదల చేస్తుంటారు. అలా నీటిని విడుదల చేసినప్పుడు కాకతీయ కెనాల్ జలకళ సంతరించుకుంటుంది. ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ కాలువలో ఈత కొట్టాలనే ఉత్సాహంతో కాలువలో దిగిన పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ప్రతీ సంవత్సం ముగ్గురుకి పైగా ప్రాణాలు పోతున్నాయి. దీంతో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలనీ..హెచ్చరికల బోర్డులతో పాటు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.