ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా

  • Edited By: veegamteam , September 16, 2019 / 05:22 AM IST
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా

ప్రశ్నించారు. అన్యాయాలను గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు.  గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడితే పోలీసులు గొంతునొక్కే ప్రయత్నం చేస్తూ..అక్రమ అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కంటే కక్షసాధింపు చర్యలపైనే ఎక్కువగా దృష్టిపెడుతోందనీ..రాష్ట్రంలో అభివృద్ధిని వెనక్కి పరిగెత్తించటం మాత్రమే తెలుసు తప్ప  ముందుకు తీసుకెళ్లటం తెలీదని ఎద్దేవా చేశారు. కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండాలా వ్యవహరిస్తోందంటూ విమర్శాస్త్రాలు సంధించారు.

కాగా..గుంటూరు జిల్లా గురజాలలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సభ నిర్వహించాలనుకున్నారు. ఈ సభకు  పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సరే సభకు వెళ్లేందుకు కన్నా సిద్ధమయ్యారు. గురజాలలో 144 సెక్షన్, పోలీసు 30 యాక్టు అమల్లో ఉందని..గురజాలకు రావొద్దని కన్నాకు పోలీసులు సూచించారు.

అయినా..వినిపించుకోకుండా కన్నా బయలుదేరటంతో.. సభకు అనుమతినిచ్చేదిలేదని పోలీసులు స్పష్టంచేశారు. ఒకవేళ కన్నా బలవంతంగా సభకు వస్తే అరెస్టచేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఈక్రమంలో ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అంటు కన్నా ప్రశ్నించారు.