మోటర్ బైక్ ముట్టుకున్నందుకు దళిత కుటుంబంపై దాడి

  • Published By: nagamani ,Published On : July 20, 2020 / 04:12 PM IST
మోటర్ బైక్ ముట్టుకున్నందుకు దళిత కుటుంబంపై దాడి

కంప్యూటర్ యుగంలో కూడా కులాల పేరుతో దాడులకు తెగబడుతున్న ఘటనలు చూస్తుంటే మనిషి అనాగరికంలోకి కూరుకుపోతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కుల దురహంకారంతో దళుతులపై పలు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని వినాజీ గ్రామంలో ఓ దళిత యువకుడు అనుకోకుండా అగ్రకులానికి చెందినవారి మోటర్ బైక్ పై చేయి వేశాడు. అది పెద్ద నేరంగా భావించిన సదరు వ్యక్తులు ఆ యువకుడి కుటుంబంపై దాదాపు 15మంది అగ్రకులస్తులు దాడికి దిగారు. అశ్లీలంగా తిడుతూ..బూటు కాళ్లతో ఇష్టమొచ్చినట్లుగా తన్నారు. కర్రలతో చావబాదారు. దీంతో బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దళిత కుటుంబంపై అగ్రకులస్తులు చేసిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ..దళిత వ్యక్తి సహా అతడి కుటుంబంపై మూకదాడి జరిగినట్లుగా ఫిర్యాదు మేరకు తలికోట్‌లో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశాం. ఓ దళిత యువకుడు అనుకోకుండా ద్విచక్ర వాహనాన్ని ముట్టుకున్నాడని..అది అగ్రకులాల వారికి చెందినదనీ..దీంతీ 13 మంది అగ్ర కులానికి చెందిన కొందరు వ్యక్తులు దళిత వ్యక్తిపై అతడి కుటుంబపై మూకదాడికి దిగి తీవ్రంగా కొట్టారనీ దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి బాధితులు 13మంది పేర్లు కూడా చెప్పారని వారందరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం 143, 147, 324, 354, 504, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.