జైలుశిక్ష పడితే సినిమాల్లో నటించకూడదా?..కర్ణాటక ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

  • Published By: nagamani ,Published On : August 18, 2020 / 12:26 PM IST
జైలుశిక్ష పడితే సినిమాల్లో నటించకూడదా?..కర్ణాటక ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

‘కేజీఎఫ్’ 2లో ప్రముఖ బాలివుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ ‘అధీరా’ లుక్ లో అద్దరగొట్టేశాడనే టాక్ కూడా వచ్చేసింది. ‘అధీరా’ అంటే సంజూ భాయ్ లెక్క అన్నట్లుగా ఉన్నడు ఈ గెటప్ లో. పాత్ర ఏదైనా సంజూ భాయ్ దాంట్లో ఒదిగిపోతారనీ..అతనో గొప్ప నటుడునే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.



ఇదిలా ఉండగా ..అక్రమంగా ఆయుధాలు కలిగివున్నారన్న కేసులో టాడా చట్టం కింద విచారణను ఎదుర్కొని, జైలు శిక్షను కూడా అనుభవించిన సంజయ్ దత్ నటిస్తున్న సినిమా షూటింగ్ కు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారించిన దాన్ని కొట్టి వేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి సినిమాల్లో నటించకూడదా? అలా చట్టంలో లేదే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

వివరాల్లోకి వెళితే..హుబ్లీ ప్రాంతానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి, ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తూ..పలు కేసుల్లో శిక్షలు కూడా అనుభవించిన ఓ దోషి నటిస్తున్న సినిమాకు ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఈ పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ ఏఎస్ ఓరా..ఈ కేసులో ఎటువంటి ప్రజా ప్రయోజనమూ కనిపించడం లేదని..జైలు శిక్ష పడిన వ్యక్తి సినిమాల్లో నటించకూడదని చట్టంలో లేదని, అందువల్ల దీన్ని కొట్టి వేస్తున్నామని ప్రకటించారు.



నటుడు యశ్ ‘కేజీఎఫ్’ సినిమా సూపర్ హిట్ గానే కాగా..కలెక్షన్ల చరిత్రను తిరగరాసింది. అన్ని భాషల్లోనూ విజయవంతమైన కేజీఎఫ్ యశ్ నటనకు నీరాజనాలు పట్టారు అభిమానులు. దీనికి సీక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ‘అధీరా’ పాత్రను పోషిస్తుండగా, ఇటీవల ఆయన లుక్ విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసిందే.