తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ : భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని

  • Edited By: veegamteam , November 11, 2019 / 03:34 AM IST
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ : భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పంచారామ క్షేత్రాలు రద్దీగా మారాయి. తెల్లవారుజామునే పుణ్య స్నాచాలు చేశారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ద్రాక్షారామం, కోటిపల్లి, పాదగయ, అయినవిల్లి, ముక్తేశ్వరం ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సప్తగోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వదిలారు. అనంతరం స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, మొక్కుల చెల్లింపులతో సందడి నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామక్షేత్రంలో కార్తీకశోభ సంతరించుకుంది. శిరోభాగం నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయమే నదీస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. కార్తీక సోమవారం సందర్భంగా  ఆలయంలో దీపారాధన, రుద్రాభిషేకంలో భక్తులు నిమగ్నమయ్యారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక సోమవారంతో భక్తుల సందడి నెలకొంది. ఉదయమే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారి అభిషేకం రద్దు చేసి శీఘ్రదర్శనంతో భక్తులకు అవకాశం కల్పించారు ఆలయ అధికారులు. పార్వతి పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు.. సాయంత్రం వేదపండితులు, 11మంది ఋత్వికులతో మహాలింగార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

కార్తీక సోమవారం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారు మోగుతున్నాయి. శివలింగపురం, నీలకంఠేశ్వరస్వామి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా దీపాలు వెలిగించి దీపారాధన చేశారు.

ఖమ్మం జిల్లా మధిరలోని శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహించి శివదర్శనం చేసుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు దీపారాధన నిర్వహించారు.

ప్రకాశం జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చీరాల శివాలయం, పేరాల పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయం, జాండ్రపేట, ఈపూరుపాలెం, వేటపాలెం, కొత్తపేట ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీపారాధనలు, ప్రత్యేక అభిషేకాలతో భక్తుల సందడి నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో శీఘ్ర దర్శనం ఏర్పాటు చేశారు.