రైతులూ ఆగమాగం కావొద్దు : ఎర్రజొన్న రైతుల సమస్య పరిష్కరిస్తాం - కేసీఆర్

రైతులూ ఆగమాగం కావొద్దు : ఎర్రజొన్న రైతుల సమస్య పరిష్కరిస్తాం – కేసీఆర్

రైతులూ ఆగమాగం కావొద్దు : ఎర్రజొన్న రైతుల సమస్య పరిష్కరిస్తాం – కేసీఆర్

ఎవరో చెప్పిన మాటలు రైతులు వినవద్దని..ఎర్రజొన్న రైతుల సమస్య తప్పకుండా పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. కేవలం ఎన్నికల నేపథ్యంలో కొంతమంది మాటలు చెబుతారని..ఈ సమయంలో ఆగమాగం కావొద్దని సూచించారు. మార్చి 19వ తేదీ మంగళవారం సాయంత్రం స్థానిక గిరిరాజ్ మైదానంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు గుప్పించారు కేసీఆర్. 

తెలంగాణ ఉద్యమానికి ఆక్సిజన్ అందించిన జిల్లా నిజామాబాద్ అని, జెడ్పీ పీఠంపై ప్రజలు గులాబీ జెండా ఎగురవేశారన్నారు. సమైక్య పాలనలో వ్యవసాయం పూర్తిగా నాశమైందని..ఈ జిల్లా నుండి వలసలు ఎక్కువయ్యాన్నారు. 5 సంవత్సరాలు పూర్తయినా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు మంచి ధర వచ్చే విధంగా చూసినట్లు వెల్లడించారు.

ఎర్రజొన్న రైతులు బాధ పడుతున్నారని, వీరికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాటి రోజులు మరిచిపోవద్దని, వారు బకాయిపడిన డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటనలు చేసే అవకాశం ఉండదని..ఎవరో మాటలు విని ఆగమాగం కావద్దని రైతులకు సూచించారు. కొత్త మండలాలు కావాలని డిమాండ్స్ ఉన్నాయని..తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని హామినిస్తున్నట్లు కేసీఆర్ సభలో చెప్పారు. 

×