దేశం ఆలోచించాలి : ఫెడరల్ ఫ్రంట్ రావాలి – కేసీఆర్

  • Published By: madhu ,Published On : March 19, 2019 / 02:30 PM IST
దేశం ఆలోచించాలి : ఫెడరల్ ఫ్రంట్ రావాలి – కేసీఆర్

దేశ ఆర్థిక విధానం సరిగ్గా లేదు..వ్యవసాయ విధానం సరిగ్గా లేదు.. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది.. భారతదేశంలో భూమి, నీరు, కరెంటు ఉన్నా వాడడం లేదు..ఎందుకీ ఖర్మ..కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి చెందలేదు..దేశంలో మార్పు రావాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాలి..అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలన్నారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాల్లో మార్చి 19వ తేదీ మంగళవారం టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్..కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గపు పాలన కొనసాగించాయన్నారు. వ్యవసాయానికి నీళ్లు కూడా ఇచ్చే తెలివి కేంద్రానికి లేదన్న కేసీఆర్..7,500 కి.మీటర్ల సముద్ర తీరం ఉన్నా ఎగుమతులు, దిగుమతులు సరిగ్గా చేయడం లేదన్నారు.

మంచినీళ్లు కూడా సరిగ్గా లేని సింగపూర్ డెవలప్‌మెంట్ అవుతోందని..ఎవరో ఒకరు ముందుకు వెళితేనే దేశంలోని దరిద్రం పోతుందన్నారు. దేశంలో మూడు లక్షల మెగావాట్ల కరెంటు ఉందా ? లేదా అని నిలదీశారు. ఉన్న కరెంటు కూడా వాడుకొనే తెలివి లేదని విమర్శించారు. తాను వాస్తవాలు చెబుతుంటే ఎదురు దాడి చేయడం కరెక్టేనా అని నిలదీశారు కేసీఆర్.