మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం

సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.

మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం

సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.

ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయని నామా అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలతో పాటే నేనూ నడవాలని నిర్ణయం తీసుకున్నానని, అందుకే టీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు. పార్టీలకు అతీతంగా జనం కారు గుర్తుకు ఓటు వేయాలని నామా పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 16 ఎంపీ సీట్లలో గెలిపించాలని కోరారు.
Read Also : జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు : మోహన్ బాబు

70ఏళ్ల అసమానతలను కేసీఆర్ ఐదేళ్లలో సరి చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో నామాను గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధికి కేసీఆర్ మరిన్ని నిధులు ఇస్తారని తుమ్మల చెప్పారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకి అనూహ్యంగా ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కింది. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని.. కేసీఆర్.. నామాకు టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నామా.. లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్నారు.
Read Also : మనకు మనమే పోటీ : ఢిల్లీని శాసిద్దాం – హరీష్