ఆఫ్ఘన్ లో భారతీయుడి ఆత్మాహుతి దాడి : 29మంది దర్మరణం

  • Published By: nagamani ,Published On : August 5, 2020 / 11:46 AM IST
ఆఫ్ఘన్ లో భారతీయుడి ఆత్మాహుతి దాడి : 29మంది దర్మరణం

దారి తప్పి ఇస్లామిక్ ఉగ్రవాదుల్లో చేరాడు ఓ భారతీయ యువకుడు. అలా ఉగ్రవాదుల్లో చేరిన అతను మానవబాంబుగా మారి మారణ హోమాన్ని అప్ఘానిస్తాన్‌లో సదరు భారతీయుడు మానవ బాంబుగా మారి జరిపిన ఆత్మాహుతి దాడిలో 29 మంది చనిపోయారు.



మతోన్మాదాన్ని నరనరానా జీర్ణించుకున్న భారతీయ యువకుడు మారణహోమానికి దాదాపు 30మంది దుర్మరణం చెందారు. కేరళకు చెరందిన కాలెకెట్టియ పురయిల్ ఇజస్ అనే 37ఏళ్ల యువకుడు అప్ఘానిస్తాన్‌లో ఆదివారం జలాలాబాద్ లోని జైల్లో జరిపిన ఈ ఘోరంలో 29మంది చనిపోగా..300 మంది ఖైదీలు పారిపోయారు. ఈ దాడిలో 30 మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు పాల్గొన్నారు.

కాసరగోడ్ జిల్లాకు చెందిన పురయిల్ దాడికి పాల్పడినట్లు ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ పండిట్ ట్వీట్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అదే మాట చెబుతున్నాయి. పురయిల్ దాడిలో పాల్గొన్నట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కూడా చెప్పుకొచ్చింది. పురయిల్ తన కుటుంబంతో సహాయ 2016లో జూన్‌లో భారత్ నుంచి పారిపోయాడు. ఇరాన్ లోని ఖోరాసెన్ వెళ్లి ఐసిస్ ఉగ్రవాదుల్లో చేరిపోయాడు. ప్రస్తుతం అతని భార్య రాఫేలా, కొడుకు అప్ఘాన్ పోలీసులు అదుపులో ఉన్నాడు.



కాగా జైలులో ఈ ఉగ్రదాడి జరిగిన సమయంలో 1793మంది ఖైదీలు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది తాలిబాన్ ఉగ్రవాదులే. జైలు ఎంట్రన్స్ వద్ద ముష్కరులు కారు బాంబులను పేల్చారు. దాదాపు 20 గంటల పాటు జరిగిన యుద్ధంలో దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఎనిమిది మంది మరణించారు.

ఇస్లామిక్ స్టేట్ జరిపిన దాడుల్లో కాసర్గోడ్ వ్యక్తి ప్రమేయం ఉందని భారత ఏజెన్సీలు అనుమానించడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలో , వందలాది మంది ప్రార్థనల కోసం గుమిగూడిన గురుద్వారాలోకి చొరబడి.. భారతీయులతో సహా 27 మందిని చంపిన ముగ్గురు ముష్కరులలో ఒకరు కూడా కాసర్గోడ్ నుండి వచ్చిన భారతీయ జాతీయుడని అనుమానిస్తున్నారు. అతన్ని అబూ ఖలీద్ అల్-హిందీ అని కూడా పిలువబడే ముహమ్మద్ ముహ్సిన్ గా గుర్తించారు.