ప్రెజర్ కుక్కర్‌లో బంగారం స్మగ్లింగ్

  • Published By: nagamani ,Published On : September 5, 2020 / 02:20 PM IST
ప్రెజర్ కుక్కర్‌లో బంగారం స్మగ్లింగ్

కేరళలోని కరీపూర్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలించే బంగారాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి ప్రెజర్ కుక్కర్‌‌లో బంగారాన్ని దాచి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దాదాపు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అతని నుంచి కీలక సమాచారం కోసం విచారిస్తున్నారని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది.

వందేభారత్ మిషన్‌లో భాగంగా కాలికట్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అంది. ఆ విమానంలో జెడ్డా నుంచి వస్తున్న మలప్పురానికి చెందిన వ్యక్తి ప్రెజర్ కుక్కర్‌లో బంగారం తీసుకువచ్చాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా దాని లోపల బంగారం దాచి పై నుంచి కుక్కర్ సీల్ చేశాడు. స్కానింగ్ చేయగా అనుమానం రావడంతో దాన్ని పగలగొట్టి చూడగా బంగారం ముద్ద బయటపడింది. ఈ స్మగ్లింగ్ రాకెట్ వెనక ఉన్నవారి వివరాలు తెలుసుకునేందుకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.