కోర్టులో లొంగిపోయిన కోడెల శివరామ్

  • Published By: vamsi ,Published On : October 1, 2019 / 07:58 AM IST
కోర్టులో లొంగిపోయిన కోడెల శివరామ్

తెలుగుదేశం నాయకులు, మాజీ సభాపతి దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివారామ్ గుంటూరు జిల్లా నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం(01 అక్టోబర్ 2019) లొంగిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్, కూతురుపై పలు ఆరోపణలు రాగా వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. వివిధ పనుల నిమిత్తం డబ్బులు వసూలు చేశారని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్స్ ఇచ్చారు బాధితులు. 

అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలోనూ కేసులు నమోదు అయ్యారు. ప్రభుత్వానికి చెందిన వస్తువులు ఇంట్లో, క్యాంప్ ఆఫీసులో కాకుండా ఓ ప్రైవేట్ వాహన షోరూంలో ఉండటంపైనా కేసులు ఉన్నాయి. ఐదేళ్లలో కోడెల శివరాం అరాచకాలు చేశారంటూ చాలా మంది ఫిర్యాదు చేసిన చేయటం, కేసులు నమోదు చేయటం తెలిసిందే. 

ఈ క్రమంలోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో శివరామ్ కెన్యాలో ఉన్నారు. కోడెల మరణం తర్వాత ఇక్కడకు వచ్చిన శివరామ్.. తనపై నమోదైన కేసుల విషయంలో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. అక్టోబర్ 1వ తేదీ కోర్టులో లొంగిపోయారు.