కరోనా కాటేస్తున్నా.. కోర్టులు కాదన్నా.. ఏపీలో కత్తులు కట్టిన కోళ్లు.. ఎమ్మెల్యేలే అతిథులు

కరోనా కాటేస్తున్నా.. కోర్టులు కాదన్నా.. ఏపీలో కత్తులు కట్టిన కోళ్లు.. ఎమ్మెల్యేలే అతిథులు

కరోనా కాటేస్తున్నా.. కోర్టులు కాదన్నా.. కత్తులు దూసుకుంటున్నాయి పందెం కోళ్లు.. ఎమ్మెల్యేలే అతిథులుగా ఆనవాయితీ అంటూ.. పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగులు కాస్తూ కోడిపందేల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కరోనా భయం వెంటాడుతున్నా.. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా సంక్రాంతి కోడిపందాలు ఆగట్లేదు.

రాష్ట్రంలో ఉభయగోదావరి జిల్లాల్లోనే కాదు.. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా కోడి పందాలు విపరీతంగా జరుగుతున్నాయి. కోడిపందెలకు పెట్టింది పేరైన ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలే స్వయంగా పందాలను ప్రారంభించడంతో కోడిపందేలు ఊపందుకున్నాయి. నిబంధనలను పాటించకుండా ప్రజలకు చెప్పాల్సిన ప్రతినిధులే దగ్గరుండి కోడి పందాల‌ను ప్రోత్సహిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా సీసలిలో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు కోడి పందాలు ప్రారంభించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో జోరుగా సాగుతున్న కోడి పందేలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులే పోటీలను ప్రారంభించడంతో నిర్వాహకులు పోలీసుల ఆంక్షలను తుంగలో తొక్కి మరి దర్జాగా పోటీలను నిర్వహిస్తున్నారు.

ఈ ఉదయం నుంచి కూడా గుంటాడ, మూడు ముక్కలాటతో పాటు కోడి పందెల్లో సుమారు లక్షల రూపాయల్లో చేతులు మారినట్లుగా తెలుస్తోంది. అమలాపురం రూరల్ మండలం,పి.గన్నవరం నియోజకవర్గం, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, ముమ్మిడివరం మండలాలలో జోరుగా కోడి పందాలు, గుండాటలు సాగినట్లుగా చెబుతున్నారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసి, ప్రేక్షక పాత్ర వహించారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.

శ్రీకాళహస్తి పట్టణంలో కోడి పందేలు విచ్చలవిడిగా సాగాయి. పోలీసుల ఆంక్షలను పెడచెవిని పెట్టి కోడి పందాలు జోరుగా నిర్వహించారు.
వాయిస్
జిల్లాలో జల్లికట్టు, కోడి పందాలు నిర్వహించరాదని పోలీస్ శాఖ ఆంక్షలు విధించినప్పటికీ శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డులో కోండమిట్టప్రాంతంలో కోడి పందాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట ప్రాంతంలో భోగి పండుగ సంబరాల్లో భాగంగా విచ్చలవిడిగా కోడి పందాలను నిర్వహించారు. పలువురు పెద్ద ఎత్తున పందాలు కాస్తూ కోడి పందాల్లో పాల్గొన్నారు.