వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

ఎన్నికల వేళ పొలిటికల్ రంగస్థలంపై హీట్ పెరిగిపోయింది. నేతలు ఏ గట్టున ఉండాలనే విషయమై క్లారిటీ తెచ్చుకుంటున్నారు. నామినేషన్‌ల పర్వం మొదలు కావడంతో వైసీపీ నుండి టీడీపీలోకి చేరే వాళ్లు.. టీడీపీ నుంచి వైసీపీకి చేరేవాళ్లు చేరుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కర్నల్ జిల్లా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ లీడర్, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళికృష్ణ తెలుగుదేశం గూటికి చేరారు.

కర్నూల్‌ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సుజాతమ్మల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తరపున కోడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి టికెట్టు ఆశించిన మురళీకృష్ణకి ఆ పార్టీ తరుపున టిక్కెట్ దక్కలేదు. దంత వైద్యుడిగా స్థానికంగా సుపరిచితుడైన జరదొడ్డి సుధాకర్‌కు వైసీపీ టికెట్టు కేటాయించడంతో నిరాశ చెందిన మురళీ కృష్ణ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేసి సైకిలెక్కారు.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

×