రాజీనామా అంటే.. చొక్కా మార్చటమే : టీడీపీకి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే షాక్

రాజీనామా అంటే.. చొక్కా మార్చటమే : టీడీపీకి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే షాక్

రాజీనామా అంటే.. చొక్కా మార్చటమే : టీడీపీకి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే షాక్

కొవ్వూరు: పశ్చమ గోదావరి జిల్లా  కొవ్వూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు తానేటి వెంకట రామారావు (టీవీరామారావు) పార్టీకి రాజీనామా చేశారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో ఆయన కొవ్వూరు నియోజక వర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి గెలుపోందారు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వటానికి నిరాకరించటంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2014 లో జరిగిన ఎన్నికల్లో కొవ్వూరునియోజక వర్గం నుంచి గెలుపొందిన కే.ఎస్.జవహర్  ఎక్సైజ్ శాఖా మంత్రిగా పని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్దానం నుంచి టీడీపీ నుంచి వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు. 
Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

టీడీపీ కోసం తన రాజకీయ భవిష్యత్తును కూడా వదులుకుంటే చంద్రబాబు తనను  10 ఏళ్లు వాడుకొని వదిలేశారని  రామారావు ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పదవి ఇస్తానని మభ్య పెడుతూ వచ్చారని, గత 10 ఏళ్లుగా  చంద్రబాబు మాటకు విలువిచ్చానని ఆయన చెప్పారు.  చంద్రబాబు నమ్మి పార్టీ కోసం ఇంతకాలం పని చేస్తే తనకు కనీస గుర్తింపు కూడా దక్కలేదని, బాబు తనను మోసం చేశారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం  చంద్రబాబును కలవటానికి కూడా అవకాశం ఇవ్వలేదని రామారావు ఘూటుగా విమర్శలు చేశారు. బాబును నమ్ముకుంటే నా జీవితమే నాశనమైందంటూ రామారావు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో  టికెట్ ఆశించి భంగపడ్డ రామారావు రాజీనామా చేస్తానని చెప్పినా పార్టీ  హై కమాండ్ నుంచి, కానీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు  ఎటువంటి సంప్రదింపులు జరగలేదు. 
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

×