రూ.1553 కోట్ల పెట్టుబడులు.. 34వేల మందికి ఉపాధి : ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభించిన కేటీఆర్

రూ.1553 కోట్ల పెట్టుబడులు... 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి... యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 06:10 AM IST
రూ.1553 కోట్ల పెట్టుబడులు.. 34వేల మందికి ఉపాధి : ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభించిన కేటీఆర్

రూ.1553 కోట్ల పెట్టుబడులు… 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి… యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం

రూ.1553 కోట్ల పెట్టుబడులు… 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి… యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో TSIIC-TIF-MSME ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం(నవంబర్ 1,2019) ప్రారంభించారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ పార్క్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ హైవే పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఇండస్ట్రియల్ పార్కు వరకు గుట్టలను తొలిచి విశాలమైన రోడ్డు నిర్మించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగంగా సాగుతోంది. పార్కుతో పాటు పరిశ్రమల అవసరాల కోసం ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. 

వాస్తవానికి ఈ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1250 ఎకరాల భూమిని సేకరించింది. మొదటి దశలో 450 మంది పారిశ్రామికవేత్తలకు భూమిని ఇచ్చింది. మరికొంత మంది పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రెండో దశలో వారికి భూమిని ఇవ్వనున్నారు.

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో దండుమల్కాపురం కొత్తగా శోభను సంతరించుకుంది. రియల్ ఎస్టేట్‌తోపాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. ఉద్యోగాల్లో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో స్థానికులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.