కొత్త డిమాండ్ : కర్నూలును తెలంగాణలో కలపాలి

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 04:52 AM IST
కొత్త డిమాండ్  : కర్నూలును తెలంగాణలో కలపాలి

కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపాలంటూ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు స్థానికంగా హీట్ పుట్టిస్తున్నాయి. కర్నూలు జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలనీ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయాలని జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.  

విశాఖను రాజధానిగా చేస్తే రాయలసీమ వాసులకు కష్టాలు తప్పవు..ఈ కష్టాలు పడేబదులు అభివృద్దిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో కర్నూలును కలపాలని వ్యాఖ్యానించారు.  

కాగా సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటంచిన నాటి నుంచి ప్రస్తుత నేతలతో పాటు మాజీ నేతలకు కూడా పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని 29 జిల్లాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆందోళనలు..ధర్నాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల విషయంపై జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చి ఏపీలోని ప్రాంతాలమధ్య చిచ్చుపెడుతున్నారనీ..అధికారం శాశ్వతం కాదనీ ప్రజల్లో విభేదాలు సృష్టించి..రైతులను, మహిళలకు వేదనకు గురిచేసిన ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని జగన్  గుర్తించాలని సూచిస్తున్నారు. మూడు రాజధానులు అంశంపై ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.