ఏసీబీకి చిక్కిన గూడూరు తహశీల్దార్ హసీనా

  • Published By: veegamteam ,Published On : November 8, 2019 / 07:29 AM IST
ఏసీబీకి చిక్కిన గూడూరు తహశీల్దార్ హసీనా

కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దార్ షేక్  హసీనా బినామీగా పనిచేస్తున్న హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి ఏసీబీకి దొరికిపోయాడు. ఓ వ్యక్తికి సంబంధించి భూమి విషయంలో తహశీల్దార్ హసీనా రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. కానీ అతను నాలుగు లక్షలు ఇచ్చాడు. మిగిలిన నాలుగు లక్షలు ఇస్తేనేగానీ పని జరగదని హసీనాబీ బినామీ హుస్సేన్ డిమాండ్ చేశాడు. దీంతో విసిగిపోయిన సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా తహశీల్దార్ అవినీతిని బైటపెట్టే పనిలో అధికారులు వేసిన ప్లాన్ లో హసీనా బినామీ అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న హసీనా పరారయ్యారు. తహశీల్దార్  హసీనా లంచాలు తీసుకుంటుంది. కానీ డైరెక్ట్ గా తీసుకోదు.దానికో వ్యక్తిని నియమించుకుంది. దానికి సంబంధించిన లావా దేవీలన్నీ హుస్సేన అనే వ్యక్తి చూసుకుంటాడు.  

వివరాల్లోకి వెళితే..కోర్టు కేసులో  ఉన్న ఓ భూమి  రిజస్ట్రేషన్ కావాల్సి ఉంది. దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. దాన్ని క్లియర్ చేసే అధికారాలు తహశీల్దార్ హసీనా చేతిలో ఉన్నాయి.దీంతో సదరు వ్యక్తి హసీనాను అడిగాడు. కోర్టులో ఉన్న కేసు విషయంలో ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయిపోయయనీ..భూమిని తనపేరుకు మార్చాలని అడిగాడు. అలా చేయాలంటే రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది తహశీల్దార్ హసీనా. 
ఈ వ్యవహారాన్ని అంతా తన బినామీ హుస్సేన్ కు అప్పగించారు. దీంతో సదరు వ్యక్తి రూ.8లక్షలు  ఇవ్వలేను అన్నాడు. హుస్సేన్ రూ.4లక్షలకు తక్కువ అయితే పని అవ్వదని కరాఖండిగా చెప్పేశారు. దీంతో సదరు బాధితుడు రూ.4 లక్షలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 
 
ప్లాన్ ప్రకారం.. తహసీల్దార్ కోరిన మేరకు రూ. 4 లక్షలు తీసుకొని వారు అనుకున్న ప్రాంతానికి వెళ్లాడు.  అప్పటికే తహసీల్దార్ బినామి హుస్సేన్ డబ్బు తీసుకునేందుకు డబ్బు తీసుకునేందుకు రావటం సదరు వ్యక్తి నుంచి డబ్బు తీసుకునే క్రమంలో అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అధికారులు హుస్సేన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని విచారించారు. 
తహసీల్దార్ హసినా  ఆదేశాలతోనే తాను ఈ డబ్బు తీసుకునేందుకు వచ్చానని చెప్పాడు. అంనంతరం తహసీల్దార్ హసీనా బీని అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు యత్నించగా విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే పరారైంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ హసినబీ కోసం గాలింపుని ముమ్మరం చేశారు.