కశ్మీర్ పాకిస్తాన్‌దట..అని గేలిచేస్తూ నవ్విన లాహోర్ వ్యక్తిపై దాడి..అరెస్ట్

  • Published By: nagamani ,Published On : August 13, 2020 / 09:57 AM IST
కశ్మీర్ పాకిస్తాన్‌దట..అని గేలిచేస్తూ నవ్విన లాహోర్ వ్యక్తిపై దాడి..అరెస్ట్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గేలిచేసినందుకు లాహోర్ కు చెందిన ఓ వ్యక్తిపై కొంతమంది దాడికి దిగారు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్ దే అంటూ.. పాకిస్తాన్ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ను ప్రదాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదించగం తెలిసిందే. దీనిపై భారత్‌తో మండిపడుతోంది. దీనిపై లాహోర్ లోని ఓ వ్యక్తి కశ్మీర్ పాకిస్థాన్ దా? అంటూ హ్హా హ్హా అంటూ నవ్వుతూ ఓ టిక్ టాక్ వీడియోచేశారు. దాన్ని చూసిన కొంతమంది ఆ వ్యక్తిపై దాడి చేశారు. నువ్వు పాకిస్థాన్ వా? భారతీయుడివా? నువ్వు దేశ ద్రోహివి అని తిడుతూ దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతణ్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేయటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రధానమంత్రి తప్పుబడితే అరెస్ట్ చేసేస్తారా అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఇమ్రాన్ ఖాన్ జీర్ణించుకోవడం లేదు. కశ్మీరీలు తమవాళ్లను, వాళ్లకు స్వాతంత్ర్యపోరాటంలో సాయం చేస్తామని చెప్పుకొస్తు తన అక్కసునంతా వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.