డేంజర్ బెల్స్ : పోలవరం దగ్గర మళ్లీ కుంగిన భూమి

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 06:13 AM IST
డేంజర్ బెల్స్ : పోలవరం దగ్గర మళ్లీ కుంగిన భూమి

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగిపోవడం ఆందోళన రేకేత్తిస్తోంది. పాత శీనయ్య కంపెనీకి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. భారీ వాహనాలు తిరగడమే కారణమంటున్నారు అధికారులు. గతంలో మూడుసార్లు భూమి కుంగిన సంగతి తెలిసిందే. ఇక్కడ నాలుగు నెలలుగా ప్రాజెక్టు పనులు జరగడం లేదు. అయినా భూమి కుంగుతూనే ఉంది. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏఫీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పనులు జరగకపోయినా..ఒకసారి 60 అడుగుల పైకి భూమి లేవడం..భూమి కుంగిపోవడం ఘటనలు జరుగుతున్నాయి. భూమిలో వచ్చే కదలికల వల్ల..కుంగడం..లేవడం జరుగుతోందని అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ..సరియైన కారణాలు చెప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం కొంత కొంత భూమి కుంగిపోతుందనే కలకలం రేపింది. సమీపంలోని ఏజెన్సీ గ్రామాలకు చెందిన వారు ఈ రహదారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. భూమి కుంగిపోతుండడంతో వాహనదారులు, పాదచారులు భయపడిపోతున్నారు. ఇన్నిసార్లు కుంగిపోతున్నా..అధికారులు సరియైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని,  భారీ ప్రాజెక్టు స్పిల్ వే జరుగుతున్న ప్రదేశానికి దగ్గరగా ఇంత జరుగుతున్నా అధ్యయనం ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 
Read More : అగ్రిగోల్డ్‌ మరో రూ.27 కోట్ల ఆస్తులు స్వాధీనం