సీఎం జగన్ సంచలన నిర్ణయం :  అన్ని బార్ల లైసెన్సులు రద్దు

ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేశారు.

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 12:35 PM IST
సీఎం జగన్ సంచలన నిర్ణయం :  అన్ని బార్ల లైసెన్సులు రద్దు

ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఉన్నఫలంగా అమల్లోకి తీసుకొచ్చింది.

(డిసెంబర్ 31, 2019) వరకు లైసెన్సుకు గడువు ఉన్నా.. బార్లను తెరవద్దని చెప్పింది. కొత్త బార్ల పాలసీని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటికే మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూయిస్తుండగా ఇప్పుడు రాష్ట్రంలో 40 శాతం బార్లు తగ్గించి మళ్లీ లైసెన్సులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీలో జనవరి 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నారు. కొత్త పాలసీలో ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త విధానం ప్రకారం రెండేళ్లకు లైసెన్సు ఇవ్వనుంది. రెండేళ్లకు లైసెన్సు దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ధారించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేలా అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. 

లాటరీ పద్ధతిలో ప్రభుత్వం కొత్త లైసెన్సులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 798 బార్లు ఉండగా.. కొత్త పాలసీ అమలయ్యే నాటికి ఆ సంఖ్య 479కి చేరనుంది. కాగా 38 త్రీ స్టార్ హోటళ్లకు, నాలుగు మైక్రో బేవరేజ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. మద్యం ధరలను కూడా పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.