ఒక్కరోజు కిక్కు: ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు

  • Published By: vamsi ,Published On : January 2, 2020 / 02:16 AM IST
ఒక్కరోజు కిక్కు: ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో లిక్కర్‌, బీరు అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రి రాష్ట్రవ్యాప్తంగా రూ.92కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు రూ.60 కోట్ల విలువైన మద్యాన్ని ఎక్సైజ్‌ శాఖ అమ్ముతుండగా.. 50శాతం అమ్మకాలు ఒక్కరోజే పెరిగాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా సాధారణం కంటే రూ.30కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి.

ప్రతీ ఏటా డిసెంబర్ 31వ తేదీనే మద్యం అమ్మకాలు భారీగా పెరుతుండగా.. డిసెంబర్ 30వ తేదీన కూడా అమ్మకాలు భారీగా జరిగినట్లు చెబుతుంది ఎక్సైజ్ శాఖ. ఈ రెండురోజుల్లో రూ.170 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. ఒక్కరోజే 1.65 లక్షల కేసుల లిక్కర్‌, 60వేల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ చెబుతుంది.

ఏపీలో మామూలు రోజుల్లో మద్యం తాగేవాళ్లు బాగా తగ్గడంతో పండుగ సంధర్భంగా మాత్రం మద్యం అమ్మకాలు బాగా పెరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అకేషనల్‌గా తాగేవారుగా చాలామంది మారారని అంటున్నారు.