ఫస్ట్ టైం నిజామాబాద్ లో : M-3 EVM ప్రత్యేకతలు ఇవే.. ట్యాంపరింగ్ కు నో ఛాన్స్

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 06:05 AM IST
ఫస్ట్ టైం నిజామాబాద్ లో : M-3 EVM ప్రత్యేకతలు ఇవే.. ట్యాంపరింగ్ కు నో ఛాన్స్

నిజామాబాద్ : బ్యాలెట్ పేపరా.. ఈవీఎం మెషిన్లా.. వారం రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై నెలకొన్న డైలమా ఇది. ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ ఇచ్చేసింది. పేపర్ కాదు.. మెషిన్‌తోనే అని తేల్చేసింది. M-3 రకం EVMలు వినియోగిస్తామని స్పష్టం చేసింది. నిజామాబాద్ లోక్ సభ పోటీలో 185మంది బరిలో ఉన్నారు.

ఇంతకీ M-3 ఈవీఎం ఫీచర్స్ ఏంటి.. వాటి పనితీరు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. జంబో EVMలకే జై కొట్టింది ఈసీ. M-3 రకం ఈవీఎంలు వాడాలని నిర్ణయించింది. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సంయుక్తంగా తయారు చేశాయి. 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా సరే.. ఓటింగ్ నిర్వహించడం ఈజీ. ప్రస్తుతం కొన్ని మాత్రమే M-3 EVMలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న M-3 రకం EVMలను సేకరిస్తూనే… ఇంకా కావాలంటే సరఫరా చేయాలని ఈసీఐఎల్‌ను కోరాలని భావిస్తోంది ఈసీ.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ లెక్కన 1,788 M-3 టైపు EVMలు అవసరం. ఈ లెక్కన 26వేల 820 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని అంచనా. 2వేల 240 కంట్రోల్ యూనిట్లు, 2వేల 600 వీవీప్యాట్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. 2013 తర్వాతే M-3 రకం EVMలు అందుబాటులోకి వచ్చాయి.

థర్డ్ జనరేషన్ పేరుతో పిలిచే ఈ మెషిన్లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ట్యాపరింగ్ చేయాలని చూస్తే ఆకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతాయి. వాటిలో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ ఉండటంతో… వాటికవే కంట్రోల్ చేసుకుంటాయి. జీపీఎస్ కూడా ఉండటంతో.. ఎవరూ ఈ EVMలను ఎత్తుకెళ్లడానికి అవకాశం ఉండదు. హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటంతో.. ఈసీ అధికారులు M-3 EVMలకే మొగ్గు చూపారు. 

అయితే… ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే ఈసీ నిర్ణయంపై రైతులు మండిపడుతున్నారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు పైన వచ్చేలా కాకుండా.. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పేర్లు వచ్చేలా బ్యాలెట్ పేపర్ సిద్ధం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.