గుంటూరు వెస్ట్ అసెంబ్లీ బరిలో హీరోయిన్

గుంటూరు వెస్ట్ అసెంబ్లీ బరిలో హీరోయిన్

గుంటూరు వెస్ట్ అసెంబ్లీ బరిలో హీరోయిన్

ఆంధ్రప్రదేశ్ బరిలో ఈసారి భారీగా అభ్యర్ధులను దింపిన బీజేపీ ప్రముఖ హీరోయిన్ మాధవీ లతకు అవకాశం ఇచ్చింది. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాధవీ లత క్యాస్టింగ్ కౌచ్‌పై గళం వినిపించి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. తర్వాత పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేసిన ఆమె అనంతర కాలంలో బీజేపీ గూటికి చేరుకుంది. బీజేపీపై సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా పోస్ట్‌లు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడిన మాధవీ లతకు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
Read Also : గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ

గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలోనే ఆమెకు సీటు వచ్చే అవకాశం ఉందని వార్తలు రాగా అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఏపీలో మాత్రం ఆమెకు అవకాశం దక్కింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అభ్యర్ధిగా మాధవీ లతను బీజేపీ ప్రకటించింది. తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి టికెట్ కేటాయించిన నేపథ్యంలో మాధవీలత తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనకు అవకాశం ఇచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు ధన్యవాదాలు తెలిపింది.

 

×