పట్టపగలు కళ్లుమూసి తెరిచేలోగా బ్యాంకులో రూ.10లక్షలు దోచేసిన బుడ్డోడు

  • Published By: nagamani ,Published On : July 16, 2020 / 11:29 AM IST
పట్టపగలు కళ్లుమూసి తెరిచేలోగా బ్యాంకులో రూ.10లక్షలు దోచేసిన బుడ్డోడు

ఆ బుడ్డోడికి పట్టుమని పదేళ్లు కూడా ఉండవేమో. స్కూల్లో చిలిపిగా పెన్సిళ్లు..రబ్బర్లు..పెన్నులు దోచేసే ఆ వయస్సులో ఏకంగా బ్యాంకునే దోచేశాడు. పట్టపగలు..అంతా చూస్తుండగానే రూ.10లక్షలు తీసుకుని ఉడాయించాడు. కన్నుమూసి తెరిచేంతలో ఇది జరిగిపోయింది. క్షణాల్లో అక్కడనుంచి చక్కగా ఎస్కేప్ అయిపోయాడు ఆ కిలాడీ పిల్లగాడు.సెకన్ల వ్యవధిలో అక్కడి నుంచి మాయమయ్యాడు. ఈ మెరుపు దొంగ దోపిడీ బ్యాంకులో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఆ వీడియో చూసిన బ్యాంకు సిబ్బంది.. డబ్బులు దొబ్బేసింది బుడ్డోడా అనుకుంటూ షాక్ అయ్యారు. బుడ్డోడా ఎంత పనిచేశావురా అనుకుంటూ ముక్కుమీద వేలేసుకున్నారు. తరువాత తదుపరి చేసే పనిలో పడ్డారు బ్యాంకు సిబ్బంది.

వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని నిమూచ్ జిల్లా జవాద్‌లోని ఓ కార్పొరేటివ్ బ్యాంకులో రూ.10 లక్షలు మాయం అయ్యాయి. బ్యాంకుకు ఎంతోమంది కష్టమర్లు వస్తుంటారు..పోతుంటారు. ఈ క్రమంలో డ్యూటీలో ఉన్న క్యాషియర్ కస్టమర్లకు ఇవ్వటానికి కొంత డబ్బుల్ని తన టేబుల్ మీద పెట్టుకున్నాడు. తరువాత చిన్న పని మీద పక్కనే ఉన్న క్యాబిన్‌లోకి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కొన్ని డబ్బుల కట్టలు కనిపించలేదు.కంగారుగా క్యాబిన్ అంతా వెతికాడు ఎక్కడా కనిపించలేదు.ఇంతలో ఓ పిల్లాడు బైటకు పరుగెత్తుకుంటూ వెళ్లటం చూశాడు. కానీ పిల్లాడే కదాని పెద్దగా పట్టించుకోలేదు.

వెంటనే బ్యాంకు డోర్స్ అన్నీ క్లోజ్ చేసిన బ్యాంకులో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. కస్టమర్లు క్యూలో ఉండి వెయిట్ చేస్తుండగా..పదేళ్ల పిల్లాడు క్యాషియర్ క్యాబిన్‌లోకి దూరటం..అక్కడ కనిపించిన 500 నోట్ల కట్లను సంచిలో వేసుకుని పరిగెత్తటం కనిపించింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బాలుడితో ఎవరైనా ఈ పని చేయించి ఉంటారా అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ పిల్లాడు ఎవరు.. ఎటు పారిపోయాడో తెలుసుకొనే పనిలో ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పుటేజ్ లను పోలీసులు పరిశీలించారు.
బ్యాంకులో డబ్బుల కట్టలు కొట్టేసిన పిల్లాడితో పాటు పాటు మరికొందరూ వేర్వేరు దారుల్లో పారిపోయిన వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనం ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది.