చెట్టు ఎక్కిన మాస్టారు..తలా కొమ్మమీద పిల్లలు.. పాటలు..పాఠాలు అక్కడే

  • Published By: nagamani ,Published On : August 19, 2020 / 03:08 PM IST
చెట్టు ఎక్కిన మాస్టారు..తలా కొమ్మమీద పిల్లలు.. పాటలు..పాఠాలు అక్కడే

మాస్టారు పిల్లలకు చదువులు ఎక్కడ చెబుతారు? అంటే ఇదే పిచ్చి ప్రశ్న? బడిలో అంటారు. అంతగాకాకపోతే గుడిలో చెబుతారు.కానీ ఈ కరోనా కాలంలో మాత్రం ఓ మాస్టారు పిల్లలకు పాఠాలు ఎక్కడ చెబుతున్నాడో తెలుసా? ఓ చెట్టుమీద..! చెట్టుమీదకు పిల్లలందరినీ ఎక్కించాడు. తరువాత తాను కూడా బ్లాక్ బోర్డ్ పట్టుకుని చెట్టు ఎక్కాడు. అక్కడో కొమ్మమీద కూర్చున్నాడు. పిల్లల్ని కూడా తనో కొమ్మమీద కూర్చుపెట్టాడు..కరోనా నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటిస్తూ తలా ఒక కొమ్మమీద కూర్చోపెట్టాడు. తరువాత పాఠాలు చెప్పటం ప్రారంభించాడు ఆ మాస్టారు. అసలు మాస్టారు చెట్టెక్కటమేంటీ..చెట్టుమీదకు చిన్న పిల్లల్ని ఎక్కించి అక్కడ కూర్చుని పాఠాలు చెప్పటమేంటీ? అక్కడ నుంచి పిల్లలు కాలు జారి ప్రమాదవశాత్తు పడితే పరిస్థితి ఏంటీ అని అనుకోవచ్చు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..



అది మ‌హారాష్ట్ర‌లోని నందుర్బార్ జిల్లా ధ‌డ్గావ్ గ్రామం. కరోనా కాలం కదా..స్కూల్స్ అన్నీ మూత పడ్డాయి. స్మార్ట్ ఫోనుల్లో ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నారు ఓ మాస్టారు. కొంతమంది పిల్లలు మాత్రం మాస్టారు దగ్గరకు వచ్చారు. దూరంగా ఉండే పిల్లలు రావటానికి కుదరలేదు. దీంతో ధడ్గావ్ గ్రామానికి ఫోన్ సిగ్నల్స్ సరిగా రాదు.



దీంతో ఆ టీచ‌ర్ ఆన్‌లైన్ పాఠాలు చెప్ప‌డానికి వీలు ప‌డ‌డం లేదు. అందుక‌ని అక్కడకు దగ్గరలో ఉన్న ఓ చిన్న కొండ మీదున్న చెట్టెక్కి కూర్చున్నారు. ఈ విద్యార్థుల‌కు పాఠం చెబుతూనే సిగ్న‌ల్ వ‌చ్చిన‌ప్పుడు ఆన్‌లైన్ క్లాసులు కూడా చెబుతున్నారు. అదన్న మాట చెట్టెక్కిన మాస్టారు పాఠాల కథ..ఇది కధ కాదండోయ్..నిజంగానే కరోనా కాలం కదా..తప్పలేదు మరి..



సిగ్నల్స్ రావట్లేదని పిల్లలకు పాఠాలు చెప్పటం మానేయకుండా ఈ మాస్టారు నానా తిప్పలు పడి చెట్టెక్కి పాఠాలు చెబుతున్న ఈ మాస్టారి చిత్త‌శుద్ధికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. కొంత‌మంది మాత్రం చెట్టు మీద పిల్ల‌ల‌కు పాఠాలు అంటే ప్ర‌మాదంతో కూడుకున్న‌ది జాగ్ర‌త్త అంటూ సూచనలిస్తున్నారు.