తల్లికి మాటిచ్చిన గాంధీ.. జీవితంలో ఆ మూడు ముట్టలేదు!

ఆయనో మహాత్ముడు. తల్లి మాటను తప్పలేదు. స్వరాజ్య స్థాపనకు విశేష కృషి చేశారు. ప్రపంచ అహింసా వాదాన్ని గట్టిగా వినిపించి బ్రిటీష్ పాలకులను గజగజ వణికించాడు.

  • Published By: sreehari ,Published On : October 1, 2019 / 09:56 AM IST
తల్లికి మాటిచ్చిన గాంధీ.. జీవితంలో ఆ మూడు ముట్టలేదు!

ఆయనో మహాత్ముడు. తల్లి మాటను తప్పలేదు. స్వరాజ్య స్థాపనకు విశేష కృషి చేశారు. ప్రపంచ అహింసా వాదాన్ని గట్టిగా వినిపించి బ్రిటీష్ పాలకులను గజగజ వణికించాడు.

ఆయనో మహాత్ముడు. తల్లి మాటను తప్పలేదు. స్వరాజ్య స్థాపనలో విశేష కృషి చేశారు. ప్రపంచ అహింసా వాదాన్ని గట్టిగా వినిపించి బ్రిటీష్ పాలకులను గజగజ వణికించాడు. బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకున్న బాపూజీ.. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. చివరికి జాతిపితగా దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి. గాంధీ పూర్తి పేరు.. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.

1869 అక్టోబరు 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో గాంధీ జన్మించాడు. తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబం నుంచి వచ్చిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బాల్యంలో కాస్త నిదానంగా ఉండే వాడు. చిన్నతనం నుంచి అబద్ధాలకు దూరముగా ఉండేవాడు. చదువులో గాంధీ మధ్యస్థంగా ఉండేవాడు. గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్ధానంలో ఒక దివాన్ గా పని చేసేవాడు. తల్లి దండ్రుల సంరక్షణలో గాంధీజీ బాల్యం గడిచింది. పాఠశాల విడిచిన వెంటనే ఆట పాటల యందు ఆసక్తి చూపక ఇంటికి వెళ్లి పోయేవాడు. 

మాంసం తిన్నాడు.. పొగ తాగాడు : 
పోర్ బందర్, రాజ్‌కోట్ లో గాంధీ చదువు కొనసాగింది. గాంధీ విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించారు. గాంధీజీ సరిగా సమాధానాలు రాయలేకపోయాడు. తోటీ విద్యార్థిల జవాబులను చూసి రాయమని మాస్టర్ ప్రోత్సహించాడు. అందుకు గాంధీ నిరాకరించాడు. చెడు సావాసాల వల్ల పొగ తాగడం, మాంసం తిన్నాడు.

ఆ మూడు జోలికి పోలేదు :
అయితే త్వరలోనే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. ఈ విషయంలో మరోసారి తప్పు చేయనని తల్లి దండ్రులకు మాట ఇచ్చాడు. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై అనంతరం బారిష్టర్ కోర్సు కోసం లండన్ వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం.. ఆయన మాంసానికి, స్త్రీ సాంగత్యానికి, మద్యానికి దూరంగా ఉన్నారు. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివారు.

అప్పుడే గాంధీకి చదువు, వ్యక్తిత్వం, ఆలోచనా సరళీ రూపాంతరం చెందాయి. గాంధీకి 13ఏళ్ల వయస్సులో కస్తూరి బాయితో బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ) ఉన్నారు.