ప్రత్యామ్నాయ కూటమి : కోల్‌కతాలో బాబు ఫుల్ బిజీ

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 06:50 AM IST
ప్రత్యామ్నాయ కూటమి : కోల్‌కతాలో బాబు ఫుల్ బిజీ

ఢిల్లీ : 2019 లోక్ సభ ఎన్నికల లోపు ఏ ఫ్రంట్ ఏర్పడుతుంది ? ఏ ఫ్రంట్ ముందుకొస్తుందో తెలియదు కానీ..తమ తమ ఫ్రంట్‌లు ఏర్పడాలని..పలువురు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చంద్రులు…ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేశారు కూడా. నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ..దేశంలో గుణాత్మక మార్పు అని ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ ఏర్పాటు చేస్తే..బాబు మాత్రం కాంగ్రెస్‌ని కలుపుకొని పోయే ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కోల్ కతా వేదికను చక్కగా ఉపయోగించుకోవాలని బాబు ప్రణాళికలు రచిస్తున్నారు. 
18న రాత్రి బాబు కోల్ కతాకు…
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా నేతృత్వంలో యునైటెడ్ ఇండియా ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బాబు జనవరి 18వ తేదీ రాత్రి కోల్ కతాలో వాలిపోయారు. వచ్చి రావడంతోనే భేటీలు మొదలెట్టేశారు. వివిధ పార్టీల జాతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఏకం కావాలని బాబు పిలుపునిస్తున్నారు. 
జనవరి 19న నేతలతో బాబు భేటీలు…
జనవరి 19వ తేదీ ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో భేటీలు జరిపారు. మమత చేపట్టిన ర్యాలీ అనంతరం 20 పార్టీల నేతలతో బాబు మీటింగ్ జరుపపున్నారు. తదుపరి కార్యాచరణపై మార్గసూచిని ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరిలో ధర్మపోరాట సభకు జాతీయ నేతలందరినీ పిలవాలని బాబు యోచిస్తున్నారు. మరి బాబు ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.