గ్రామంలో హై ఓల్టేజ్ : సెల్ ఫోన్ ఛార్జీంగ్ పెడుతూ వ్యక్తి మృతి

  • Published By: madhu ,Published On : February 24, 2019 / 10:54 AM IST
గ్రామంలో హై ఓల్టేజ్ : సెల్ ఫోన్ ఛార్జీంగ్ పెడుతూ వ్యక్తి మృతి

అవును మీరు వింటున్నది నిజమే. అక్కడ స్విచ్ ఆఫ్ చేసినా, వేసినా కరెంటు వస్తోంది. ఇంట్లో ఉన్న వారికి ఏమి అర్థం కావడం లేదు. అసలు కరెంటు ఎలా వస్తుందో అర్థం కాలేక జుట్టు పీక్కున్నారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలియచేశాడు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ విలేజ్‌లో కరెంటు ధాటికి రైస్ కుక్కర్లు, ఫ్రిజ్జులు, ఇతరత్రా ఎలక్ట్రిక్ పరికరాలు కాలిపోయాయి. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి అనుబంధ మాన్యగుడాలోని చాలా ఇళ్లలో విద్యుత్ షాక్ తగిలింది. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొన్ని నివాసాల్లో ఉన్న విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. హై ఓల్టేజ్‌ కారణమని పలువురు అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. తమింట్లో స్విచ్ ఆఫ్ చేసినా..ఆన్ చేసినా కరెంటు వస్తోందని గ్రామంలోని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఓ వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమని, అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.