ఇంకెక్కడ భద్రత? పంచాయితీ కార్యాలయంలో చిన్నారిపై అత్యాచార యత్నం

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 05:03 AM IST
ఇంకెక్కడ భద్రత? పంచాయితీ కార్యాలయంలో చిన్నారిపై అత్యాచార యత్నం

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పసునూరిలో దారుణం జరిగింది. ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. గ్రామంలో ఉండే పంచాయితీ ఆఫీసుకి సదరు బాలికను ఓ వ్యక్తి పిలిచాడు. తెలిసున్న వ్యక్తే కదాని ఆ బాలిక అమాయకంగా వెళ్లింది. అలా వెళ్లటంతో పంచాయితీ ఆఫీసులోని గదిలోకి తీసుకెళ్లిన బాలికపై గంగిరెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని చిన్నారి భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు రావటం చూపి పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.  అనంతరం నిందితుడు గంగిరెడ్డిపై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా..దేశంలో ఆడపుట్టుకపై జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ఆడపిల్లకు కనాలంటేనే భయపడాల్సిన దారుణ పరిస్థితులు ఉన్నాయి. దీంతో అసలు దేశంలో ఆడపిల్లలకు భద్రత ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతీ సంవత్సరం క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి అంటే నేరాల సంఖ్యలో ఏ స్థాయిలో ఉందో ఊహించుకుంటేనే భయం కలుగుతోంది. ఉదయం లేచింది మొదలు నేరాలు జరగని రోజంటూ లేదు.  

ఏ పేపర్ తిరిగేసినా, ఏ న్యూస్ చానెల్ చూసిన దేశంలో ఏదో ఒకడోకచోట అత్యాచార ఘటనలు, కిడ్నాప్‌ లు,హత్యా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక 2018 సంవత్సరంలో జరిగిన క్రైమ్‌ రిపోర్టును నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఒక నివేదిక తయారు చేసింది. 2018 సంవత్సరంలో రోజుకు సగటున 80 హత్యలు, 91 మానభంగాలు, 289 కిడ్నాప్‌లు జరిగాయని వెల్లడించింది. 2017తో పోలిస్తే 2018లో క్రైమ్ రేట్ 1.8 శాతం పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.