Home » Uncategorized » మంగళగిరి మంగళప్రదం : టీడీపీ ప్రభుత్వం వస్తోంది – లోకేష్
Publish Date - 9:12 am, Sun, 24 March 19
By
madhuనా కులం మంగళగిరి..నా మతం మంగళగిరి..నా ప్రాంతం మంగళగిరి అంటున్నారు TDP అభ్యర్థి నారా లోకేష్. ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం స్థాపిస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా లోకేష్ ఉన్నారు. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న లోకేష్..విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను గెలిస్తే అభివృద్ధి మరింత చేస్తానని ప్రజలకు హామీనిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేపే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది మంగళగిరి నియోజకవర్గం. వైసీపీకి కంచుకోటగా ఉన్న మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం స్వయానా మంత్రి నారాలోకేష్ బరిలోకి దిగారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఢీ కొంటున్నారు. ఈ సందర్భంగా 10tv ఆయనతో ముచ్చటించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను గెలిపిస్తే మంగళగిరిని టీడీపీ కంచుకోటగా మారుస్తానంటున్నారు.
మంగళగిరిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కులస్తులు ఇక్కడ ఉంటారని..ఇక్కడ సంక్షేమ పథకాలు అందించడానికి అద్బుత అవకాశమన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నేతన్నలను..పసుపు రైతులను ఆదుకుంటామని లోకేష్ హామీనిచ్చారు. అర్బన్, రూరల్‌లో అవసరాలు వేరుగా ఉంటాయని, గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు కొన్ని సమస్యలున్నాయని..ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Ugadi Panchangam 2021 : జగన్, కేసీఆర్ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు భవిష్యత్తు ఏంటి?
తిరుపతి ఉప పోరులో బీజేపీకి అనుకోని షాక్..
Andhra Pradesh : పరిషత్ ఎన్నికల పోలింగ్, ఫలితాలు అప్పుడే వెల్లడించరు
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
Minister Kodali Nani: భయపడి పారిపోయి.. ఎన్నికలను అడ్డుకుంటున్నారు
Ambati Rambabu: రాష్ట్రంలో ఇక టీడీపీ శకం ముగిసినట్లే