తూఛ్..నేనిక్కడే ఉన్నాను : కనిపించట్లేదని పోలీస్ ఫిర్యాదు లేంటి? : వైసీపీ ఎమ్మెల్యే  

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 06:14 AM IST
తూఛ్..నేనిక్కడే ఉన్నాను : కనిపించట్లేదని పోలీస్ ఫిర్యాదు లేంటి? : వైసీపీ ఎమ్మెల్యే  

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై రామకృష్ణారెడ్డి స్పందించారు. నేను కనిపించటంలేదు అనే విషయం అవాస్తవం అని..నేను ఇక్కడే ఉన్నానని ప్రకటించారు. మా కుటుంబంలో ఓ పెళ్లి జరుగనుంది ఆ పెళ్లి కార్యక్రమాల హడావిడిలో ఉన్నాను తప్ప తాను కనిపించటంలేదంటూ పీఎస్ లో కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. కుప్పంలో చంద్రబాబు కనిపించక 40 సంవత్సరాలు అయిందని కుప్పం నియోజకవర్గం ప్రజలు అంటున్నారు..ఆ విషయం ఏదో చూడండి  అన్నారు. 

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ ఓట్లు వేయించుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడా మాకు కనిపించటంలేదు..తమ ఓట్ల ఎమ్మెల్యే అయిన ఆళ్ల తాము కష్టాల్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనతో తాము నడి రోడ్డుపై రోజుల తరబడి కూర్చును ఆందోళనచేస్తుంటే మా ఎమ్మెల్యే మా దరిదాపులకు కూడా రాకుండా ఏంచేస్తున్నాడు? ఎక్కడున్నాడు?  మా ఓట్లే మీకు కావాలిగానీ మా కష్టాలు మీకు అవసరం లేదా? అని ఆగ్రహం వ్యక్తంచేసిన మంగళగిరి రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించటంలేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

దీనిపై ఆళ్ల స్పందిస్తు నేను ఇక్కడే ఉన్నాను అంటూ చెప్పుకుంటున్నారు. మరి రైతుల కష్టాలు..ఇబ్బందులు ..వాళ్ల డిమండ్స్ విషయంలో కూడా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తే బాగుంటుందనీ..నేను ఉన్నానని చెబితే సరిపోదు మా డిమాండ్స్ విషయం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గం ప్రాంతంలోని రైతులు.