LED లైట్ల‌తో మ్యాన్‌హోల్స్‌… ఎంత అందంగా ఉన్నాయో

  • Published By: nagamani ,Published On : September 9, 2020 / 03:14 PM IST
LED లైట్ల‌తో మ్యాన్‌హోల్స్‌… ఎంత అందంగా ఉన్నాయో

రోడ్ల మీద మ్యాన్‌హోల్స్‌ అంటే ఠక్కున కుర్తుకొస్తాయి వర్షాలు. వర్షం పడిదంటే చాలు ఎక్కడ మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయో అడుగు అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ నడుస్తాం. అటువంటి మ్యాన్‌హోల్స్‌ మూత ఓపెన్ చేసి ఉంటే ఎంత ప్రమాదం..అసలు మ్యాన్‌హోల్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయోనని చూసుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే అవి దగ్గరకు వస్తేనే గానీ కనిపించవు. అటువంటి మ్యాన్‌హోల్స్‌ అంటే భయం కూడా..



https://10tv.in/50percent-chinese-citizens-like-modi-government-reveals-global-times-survey/
కానీ మ్యాన్‌హోల్స్‌ కూడా అందంగా ఉంటాయని తెలుసా? అందంగా LED లైట్లతో వెలిగిపోతాయని తెలుసా? అందమైన అమ్మాయిల బొమ్మలతో..పోకిమాన్ బొమ్మలతో కళ్లు తిప్పుకోనివ్వని వెలుగులతో మ్యాన్‌హోల్స్‌ని చూశారా? జపాన్ లో LED లైట్లతో వెలిగిపోయే మ్యాన్‌హోల్స్‌ చూస్తే మురికినీరు ప్రవహించే డ్రైనేజీకి ఇంత అందమైన మ్యాన్‌హోల్సా? అని ఆశ్చర్యపోతాం.


మ్యాన్‌హోల్ ఓపెన్‌లో ఉండ‌టం‌తో రాత్రులు చీక‌ట్లో న‌డిచేవాళ్లు, లైట్ లేని వాహ‌నాలు న‌డిపేవారు ఇబ్బందిప‌డుతుంటారు. నడిచి వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడుతుంటారు. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకొని జ‌పాన్ దేశం కొత్త‌గా మ్యాన్‌హోల్స్‌ను రూపొందించింది. వీటిని వావ్ అనకమానరు.


జపాన్ రాజధాని టోక్యోకు ఉత్తరాన ఉన్న టాకారోజ‌వా అనే న‌గ‌రంలో ఎల్ఈడీ లైట్ల‌తో మ్యాన్‌హోల్స్‌ను రూపొందించారు. జ‌పాన్‌లో పాపుల‌ర్ అయిన కార్టూన్ చిత్రాల‌ను మ్యాన్‌హోల్స్ మీద చిత్రీక‌రించారు. రాత్రి స‌మ‌యంలో వీటి మీదున్న ఎల్ఈడీ లైట్లు మెరుస్తుంటాయి. ఇవి ప‌గ‌లు సూర్య‌ర‌శ్మిని గ్ర‌హించి రాత్రులు వెలుతురినిస్తాయి. సాయంత్రం 5 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 2 గంట‌ల వ‌ర‌కుఈ మ్యాన్‌హోల్స్‌ వెలుగుతూ ఉంటాయి. దీంతో ప్రజలు మ్యాన్‌హోల్స్‌ ప్రమాదాల బారిన పడటం అనే మాటేలేదంటోంది జపాన్ ప్రభుత్వం. ఈ సరికొత్త మ్యాన్స్ హోల్స్ జపాన్ వాసులు తెగ మెచ్చకుంటున్నారు. దారి వెంట వెళ్లుతూ ఫోటోలు తీసుకుంటున్నారు.