100ఏళ్ల ‘Margo’: బ్రిటీష్ పాలనలోనే ‘మేకిన్ ఇండియా’కు శ్రీకారం చుట్టిన భారతీయుడు ‘Margo’కు మార్గదర్శకుడు

  • Published By: nagamani ,Published On : September 3, 2020 / 04:05 PM IST
100ఏళ్ల ‘Margo’: బ్రిటీష్ పాలనలోనే ‘మేకిన్ ఇండియా’కు శ్రీకారం చుట్టిన భారతీయుడు ‘Margo’కు మార్గదర్శకుడు

మార్గో సబ్బు. నిమ్మతాజాదనం కలిగిన సబ్బు. పూర్తి భారతదేశపు సబ్బు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మార్గో సబ్బు నేటికి మార్కెట్లో తనదైనశైలిలో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో పెద్దగా ఆదరణ లేని మార్గో సబ్బుకు చాలా మంచి చరిత్రే ఉంది. తెల్లదొరలు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లోనే ఈ ‘మార్గో’సబ్బుకు అంకురార్పణ జరిగింది. ఆనాటినుంచి ఈనాటి వరకూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది ‘మార్గో’సబ్బు.



1920లో ప్రారంభించిన ఈ మార్గో సబ్బుకు బ్రిటీషర్లు తమ వస్తువులను భారతదేశంలో అమ్ముకునేందుకు వచ్చి భారతదేశాన్ని పాలించే దశకు చేరుకున్నారు. వ్యాపారానికని వచ్చి భారత్ లో స్థిరపడిపోయి..భారతీయుల్ని బానిసలుగా చేసిన పాలించారు. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 200ల సంత్సరాలపాటు భారతదేశాన్ని పాలించారు. భారతదేశం యావత్తు తమ వస్తువులనే కొనాలి..వారి వస్తువులే ఇక్కడ అమ్ముడవ్వాలి. అంటే భారతదేశంలో అన్నీ విదేశీ వస్తువులే మార్కెట్ లో ఉండేవి. ఆరోజుల్లోనే అంటే 1920లో ‘ఖగేంద్ర చంద్ర దాస్’అనే రసాయన శాస్త్రవేత్త స్వదేశీ విప్లవకారుడుగా మారి .భారతదేశపు సబ్బుని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే ‘Margo’సబ్బు భారతదేశపు మార్కెట్ లో విదేశీ వస్తువులకు సవాలుగా నిలబడింది. భారతీయుల మన్ననలు పొందింది. భారతదేశపు బ్రాండ్ గా ‘Margo’సబ్బు ఎదిగింది..నిలబడింది. 100 సంవత్సరాలు గడిచినా ఇప్పటికే మార్కెట్ లో ‘Margo’సబ్బు నిలిచేఉంది. భారతీయ గృహాల్లో ‘Margo’మన్ననలు పొందింది.

‘Margo’సబ్బు ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో యాజమాన్యాల చేతులు మారింది. ఈ రోజు జ్యోతి లాబొరేటరీస్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ, మార్గో సబ్బు మొదట కలకత్తా కెమికల్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక శతాబ్దం క్రితం ఒక భారతీయ పారిశ్రామికవేత్త కనుగొన్న ఉత్పత్తి అనే సంగతి మర్చిపోకూడదు. ‘ఖగేంద్ర చంద్ర దాస్’పేరు ఈరోజు పెద్దగా ఎవ్వరికి తెలియకపోయినా ‘Margo’వ్యవస్థాపకుడు మాత్రం ‘ఖగేంద్ర చంద్ర దాస్’మాత్రం భారతదేశపు ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టి తమదైన ముద్ర వేసిన తెల్లదొరల అభిజాత్యానికి సవాలుగా ‘Margo’ను నిలబెట్టిన ఘనత మాత్రం కోల్ కతాకు చెందిన ‘
ఖగేంద్ర చంద్ర దాస్’దే.



కలకత్తా కెమికల్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక శతాబ్దం క్రితం ఒక భారతీయ పారిశ్రామికవేత్త కనుగొన్న ఉత్పత్తి ‘Margo’.అతా దశాబ్దాల కాలం కొనసాగింది. ఆ తరువాత అది హెంకెల్ ఇండియాకు చేతులు మారి.. మార్చి 2011 లో జ్యోతి ల్యాబ్స్‌కు విక్రయించింది. దశాబ్దాలుగా అనేక చేతులు మారినప్పటికీ, మార్గో స్పష్టమైన..మచ్చలేని చర్మానికి సాక్ష్యంగా కొనసాగుతోంది. ఇది వలసరాజ్యాల శక్తులకు వ్యతిరేకంగా భారతదేశం స్వేచ్ఛ కోసం చేసిన పోరాటానికి..స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొనే సాక్ష్యంగా నిలిచి ఉంది ‘Margo’

ఈ అసాధారణ బ్రాండ్ వెనుక ఉన్న వ్యక్తి కోల్‌కతాకు చెందిన ‘ఖగేంద్ర చంద్ర దాస్ . సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించిన దాస్, స్వదేశీ మనోభావాలను ఎక్కువగా ప్రభావితం చేసిన వాతావరణంలో పెరిగారు. అతని తల్లిదండ్రులు న్యాయమూర్తి రాయ్ బహదూర్ తారక్ చంద్ర దాస్ మరియు మహిళా ఆత్మరక్షణ నేర్పడంపై దృష్టి కేంద్రీకరించిన సంస్థ అయిన మహిళా ఆత్మ రక్షా సమితి కార్యకర్త మోహిని దేవి. తల్లిదండ్రుల ప్రభావం ముఖ్యంగా ఖగేంద్ర చంద్రదాస్ తల్లి.. దాస్ వ్యక్తిత్వంపై బలమైన ప్రభావాన్ని చూపారు.



కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి విద్యను పూర్తి చేసిన తరువాత, షిబ్‌పూర్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారు.బ్రిటీష్ ప్రభుత్వ విభజన మరియు పాలన విధానం యొక్క అభివ్యక్తి, ఈ విభజన దేశవ్యాప్తంగా భారతీయుల జాతీయవాద భావోద్వేగాలను రేకెత్తించింది, బెంగాల్ అసమ్మతి కేంద్రంగా ఎదిగింది.

జాతీయ స్వేచ్ఛ కోసం పెరుగుతున్న పిలుపును అరికట్టడానికి ఉత్తమ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, లార్డ్ కర్జన్ నిర్ణయం స్వదేశీ ఉద్యమం ఏర్పడటానికి దోహదపడిన సంఘటనల గొలుసును ప్రారంభించింది. అనేక ఇతర నిరసన మార్గాల మధ్య, భారతదేశంలో భారతీయులు చేసిన వ్యాపారాలను ఆర్థికంగా శక్తివంతం చేయడం ఉద్యమంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం, తద్వారా స్వదేశీ లేదా స్థానికంగా తయారైన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రారంభించడం .. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం జరిగేది.



ఈ సమయంలో ఖగేంద్ర చంద్రదాస్ స్వదేశీ ఉద్యమంలో భాగమయ్యాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, బాల్ గంగాధర్ తిలక్ వంటి ప్రముఖ నాయకులతో సన్నిహితంగా మెలిగేవాడు. ఈ ఉద్యమంలో దాస్ చురుగ్గా పాల్గొంటున్నట్లు బ్రిటీష్ వారి దృష్టికి వెళ్లింది. దీంతో అన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలను అనుకుంటున్న సంగతి తెలుసుకున్న దాస్ తండ్రి కొడుకును ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లమని సూచించాడు.

దాస్ తన తండ్రికి మాటకు ఎదురు చెప్పకుడదనుకున్నాడు. కానీ భారతదేశాన్ని పాలించే బ్రిటన్ మాత్రంం వెళ్లకూడదనుకున్నాదు. అందుకే ఇండియన్ సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీ నుండి స్కాలర్‌షిప్ పొంది..కాలిఫోర్నియాకు వెళ్లటానికి ఓ అమెరికన్ షిప్ లో బయలుదేరాడు.



1907 లో బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ దాస్ తో పాటు మరో ఇండియన్ విద్యార్ధి..దాస్ కు క్లాస్ మేట్ అయిన సురేంద్ర మోహన్ బోస్ ఇద్దరినీ స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి మార్చారు. అలా 1910 లో కెమిస్ట్రీలో బి.ఎస్.సి డిగ్రీలతో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన మొట్టమొదటి భారతీయులు కావడమే కాక..అసలు సిసలైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు ఖగేంద్ర చంద్ర దాస్ ‘Margo’సబ్బు ద్వారా.ఇంటి నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్నాగానీ దాస్ భారత్ తో జరిగే ఉద్యమంలో పాలుపంచుకునేవాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ పేరుతో కాలిఫోర్నియా బ్రాంచ్‌లో భాగమయ్యాడు.

గ్రాడ్యుయేషన్ తరువాత..దాస్ సురేంద్ర మోహన్ బోస్ పాటు భారతదేశానికి బయలుదేరాడు. వారి యువ హృదయాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ఉత్సాహంగా మారి..భారత్ లో స్వదేశీ వ్యాపారం ప్రారంభించటానికి నాందిపలికారు. దాస్ స్నేహితుడు సురేంద్ర మోహన్ బోస్ డక్ బ్యాక్ బ్రాండ్ పేరుతో గొడుగులు..రెయిన్ కోట్లను తయారు చేయడం ప్రారంభించగా.. దాస్ 1920 లో టాయిలెట్ తయారీకి కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.



జపాన్లో ఔషధ విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన అతని అనుభవం సాంప్రదాయ భారతీయ ముడి పదార్థమైన వేపలో విలువను కనుగొనేలా చేసింది. అలా ‘Margo’సబ్బు వేప టూత్‌పేస్ట్ అనే రెండు ప్రముఖ ఉత్పత్తుల ప్రారంభానికి దారితీసింది.

భారతదేశ స్వదేశీ పదార్థాలతో తయారు చేయబడిన ఈ ఉత్పత్తి మార్కెట్లో బ్రిటిష్ వారు తయారు చేసిన వస్తువులకు ధీటుగా నిలిచాయి.విదేశీ గుత్తాధిపత్యాన్ని కూల్చివేసేందుకు మార్గంగా నిలబడ్డాయి. అంతేకాదు దాస్ మరింతగా తన పరిజ్నానాన్ని విస్తరించి..సంపన్నుల కోసం ‘లావెండర్ డ్యూ అనే టాల్కమ్ పౌడర్‌’ను తయారు చేశారు. ఇది ‘Margo’సబ్బు..వేప టూత్‌పేస్ట్‌లు..భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా మంచి పేరుతెచ్చుకున్నాయి.



పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, సంస్థ తన పంపిణీ కార్యాలయాలను భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించడం ప్రారంభించి..తమిళనాడులో అదనపు తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల్లోనే ఈ ఉత్పత్తులు ఆగ్నేయ ఆసియా దేశాల అంతర్జాతీయ మార్కెట్లలో పంపిణీ చేయడం ప్రారంభించారు. దాస్..సురేంద్ర బోస్ లు కలిసి.

భారతదేశంలో తయారైన ఈ ఉత్పత్తులు భారతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి మానసికంగా..ఆర్థికంగా శక్తివంతంగా ఎదిగాయి. బలపరిచాయి. 20 వ శతాబ్దంలో భారతదేశపు ఉత్పత్తుల్ని తెల్లదొరల వ్యాపారంలో మంటలు రగిలించారు.



తరువాతి కాలంలో దాస్ తన జీవితాన్ని తన సంస్థ ‘Margo’బ్రాండ్ అభివృద్ధికి అంకితం చేయడమే కాకుండా, యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ ఉద్యమానికి అంకితం చేశారు. అంతేకాదు భారతీయ యువతకు ఉద్యోగాలు కల్పించారు దాస్.యువతను స్వదేశీ వస్తువులు తయారు చేయాలని ప్రోత్సహించేవారు దాస్.

అలా ఎంతోమంది భారతీయులకు మార్గదర్శకంగా నిలిచారు ‘Margo’సబ్బు మార్గదర్శకుడు ఖగేంద్ర చంద్రదాస్. అతని వ్యాపార నైపుణ్యం చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. 1965 లో దాస్ కన్నుమూశారు. ఈ సంస్థ దక్షిణాసియా ప్రాంతంలోని ఎఫ్‌ఎంసిజి రంగంలో ప్రముఖమైన సంస్థగా నిలిచింది. ఒక శతాబ్దం తరువాత కూడా అతని వారసత్వం కొనసాగుతోంది ‘Margo’ద్వారా.