ఆస్తుల కోసమే అమృత నాపై ఆరోపణలు : మారుతీరావు తమ్ముడు శ్రవణ్

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 11:08 AM IST
ఆస్తుల కోసమే అమృత నాపై ఆరోపణలు : మారుతీరావు తమ్ముడు శ్రవణ్

మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత ఆయన తమ్ముడు శ్రవణ్ పై మారుతీరావు కుమార్తె..అమృతాప్రణయ్ సంచలన ఆరోపణలు చేసింది. మారుతీరావును కనీసం నా తండ్రి అని కూడా సంబోధించిన అమృత ‘‘మారుతీరావు’’అంటూ మాట్లాడింది. ఈ క్రమంలో మారుతీరావుకు..ఆయన తమ్ముడు శ్రవణ్ కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయనీ..ఆ తగాదాలతోనే మారుతీరావును శ్రవణ్ చాలాసార్లు కొట్టాడని..దాంతో భయపడిన మారుతీరావు ఎక్కుడో దాక్కున్నాడనీ అమృత చేసిన ఆరోపణలను శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. 

 

 

మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమతాప్రణయ్ చేసిన ఆరోపణలపై మారుతీరావు తమ్ముడు..అమత బాబాయ్ శ్రవణ్ స్పందించారు. మా అన్న మారుతీరావుకు నాకు ఎటువంటి విభేదాలు లేవనీ..ఆస్తుల విషయంలో అస్సలు తగాలు లేనే లేవని స్పష్టంచేశారు. మా అన్న మారుతీరావుపై కేసులు ఉన్నాయి. దీంతో నేను కాస్త దూరంగా ఉన్నమాట నిజమే. కానీ విభేదాలు మాత్రం లేవని స్పష్టంచేశారు శ్రవణ్. అమృత నాపై చేసిన ఆరోపణలు వాస్తవం కాదనీ..ఆస్తుల కోసమే అమృత ఇటువంటి ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రవణ్. 

తన తండ్రి భౌతికకాయాన్నిచూడానికి అమృత శ్మశానానికి వచ్చిందనే విషయం కూడా నాకు తెలియదనీ..నా అన్నకు అంత్యక్రియలు సొంతకొడుకులా నేనే చేశాననీ అటువంటిది ఆయనతో నాకు విభేధాలు..ఆస్తుల గురించి గొడవలు..నేను మారుతీరావును కొట్టాటననే అమృత చేస్తున్న ఘోరమైన ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని అన్నారు. అమృతకు ఆమె తల్లి..మావదిన గిరిజకు ఇష్టమైతే వాళ్లు వాళ్లు ఒకటి కావచ్చు. అంతేకానీ అమృతను నేను మాత్రం ఇంటికి రమ్మని అనేది లేదనీ..మా వదిన తన కూతుర్ని తెచ్చుకుంటే అది ఆమె ఇష్టం దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని..తండ్రి బ్రతికున్నంత కాలం  తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసిందనీ..ఇప్పుడు ఆయన చనిపోయాక ఆయన ఆస్తుల కోసం ఇలా నాపై ఆరోపణలు చేస్తోందని శ్రవణ్  తెలిపారు.

మా అన్న మారుతీరావంటే మాకు ఎంతో గౌరవం అనీ పుట్టిన 57 సంత్సరాల నుంచి కలిసి మెలిసి మెరిగామనీ ఇప్పటికీ మా ఇద్దరికీ వ్యాపారాలు కలిసే ఉన్నాయని..కుటుంబాలు వేరు పడ్డాం కానీ వ్యాపారాలు అన్ని కలిసే ఉన్నాయనీ..అటువంటి తమ కుటుంబాల్లో ఆస్తులు..తగాదాలు అంటూ అమత చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనుకుంటోందంటూ శ్రవణ్ స్పష్టంచేశారు.  మా అన్న బ్రతికి ఉన్నంత కాలం అమృతను ఇంటికి తీసుకురావటానికి ఎంతగానో యత్నించారని దాని కోసం చేసిన ఏ ప్రయత్నాల్ని అమృత సాగనివ్వలేదనీ అలాగే మానసిక వేదనకు గురైన ఆత్మహత్య చేసుకేనేదాకా అమృత సాధింపులు కొనసాగించిందనీ..మా అన్న మారుతీరావు గురించి తెలిసిన ఎవ్వరూ ఆయన దుర్మార్గుడని ఒక్కరూ కూడా అనరు..ఆయన చాలా సౌమ్యుడు..సేవాకార్యక్రమాలు చేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకునే దుస్థితికి అమృత తీసుకొచ్చిందని శ్రవణ్ ఆరోపించారు.