మేడారం సమ్మక్క సారలమ్మ జాతర: హుండీ కలెక్షన్లలో కొత్త రికార్డు

  • Published By: vamsi ,Published On : February 19, 2020 / 01:59 AM IST
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర: హుండీ కలెక్షన్లలో కొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర ‘మేడారం సమ్మక్క సారలమ్మ జాతర’. తెలంగాణ కుంభమేళాగా భావించే ఈ గిరిజన జాతర జాతర ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర ఈ ఏడాది ఘనంగా ముగిసింది. అయితే ఈ ఏడాది ఈ జాతర కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 

ఈ ఏడాది మేడారం జాతరకు ప్రతిసారి కంటే జనం ఎక్కువగా రావడంలో కొత్త రికార్డులను క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు హుండీ లెక్కింపుల్లో కూడా కొత్త రికార్డులు నమోదు చేసింది. ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. 2018 జాతరలో 10 కోట్ల 17 లక్షల 50 వేల 363 రూపాయలు హుండీ ఆదాయం రాగా.. ఈసారి ఇప్పటికే ఆ ఆదాయం కంటే ఎక్కువ వచ్చేసింది.

ఇప్పటి వరకు 10 కోట్ల 29 లక్షల 92 వేల రూపాయలు లెక్కించినట్లు చెబుతున్నారు. మొత్తం 494 హుండీలు ఉండగా.. మంగళవారం (ఫిబ్రవరి 18) నాటికి 420 హుండీల్లో లెక్కింపు ముగిసింది. ఇంకా 74 హుండీల్లో ఆదాయం లెక్కించాల్సి ఉంది. ఇందు కోసం మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. హుండీల్లో భక్తులు వేసిన కానుకలను ఏడు రోజులగా హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపంలో లెక్కిస్తున్నారు. 

Read More>> అవిభక్త కవలల స్కూటర్ రైడింగ్ అదుర్స్..! వీడియో వైరల్