రీటెండర్ తో రూ.628 కోట్లు ఆదా : పోలవరం ప్రాజెక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్

పోలవరం ప్రధాన ప్రాజెక్ట్‌ రీ-టెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్‌ తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 10:32 AM IST
రీటెండర్ తో రూ.628 కోట్లు ఆదా : పోలవరం ప్రాజెక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్

పోలవరం ప్రధాన ప్రాజెక్ట్‌ రీ-టెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్‌ తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో

పోలవరం ప్రధాన ప్రాజెక్ట్‌ రీ-టెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్‌ తో రూ.628 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో కంటే 12.6 శాతం తక్కువకు  పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం రూ.4,987 కోట్లకు టెండర్‌ పిలవగా.. రూ.4,358 కోట్లకు మేఘా ఇంజనీరింగ్‌ టెండర్ వేసింది. హెడ్‌ వర్క్స్‌, జల విద్యుత్‌ కేంద్రాల  నిర్మాణ పనులను మేఘా సంస్థ చేపట్టనుంది. మేఘా సంస్థకు పనుల అప్పగింతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రూ.4,358 కోట్లను కోట్ చేసి ఎల్-1గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిలిచింది. ప్రభుత్వం రూ.4,987 కోట్ల ఇనిషియల్ బెంచ్ మార్క్ విలువ నిర్దారించింది. హెడ్ వర్క్స్, ఎర్త్  కమ్ రాక్ ఫిల్ డ్యామ్, జల విద్యుత్ కేంద్రాలకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది ప్రభుత్వం. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసిన సంస్థగా మేఘా గుర్తింపు పొందింది.

ఆగస్టు 17న రివర్స్ టెండర్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 20వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఏడు సంస్థలు ఆసక్తి చూపినా మేఘా సంస్థ ఒక్కటే బిడ్ ను దాఖలు చేసింది. తెలంగాణలో ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థ రికార్డు సమయంలో పూర్తి చేసింది. పోలవరం 65వ ప్యాకేజీకి నిర్వహించిన రివర్స్ టెండర్లలో కూడా ప్రభుత్వానికి దాదాపు రూ.58కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. 
 

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రివర్స్ టెండరింగ్ కు నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ కు ఒకే సంస్థ టెండర్ దాఖలు చేసింది. మేఘా ఇంజనీరింగ్  దాఖలు చేసిన టెండర్ గతం మొత్తం కంటే 12.6 శాతం తక్కువకే కోట్ చేసింది. దీని ద్వారా రూ.628 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. పోలవరం ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన  కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా.. ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4,358 మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టనుంది.

టీడీపీ ప్రభుత్వ హయంలో పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు దక్కించుకన్న వాటిలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని జగన్ ప్రభుత్వం నిర్దారించింది. దీంతో ఎక్కడి పనులు అక్కడ ఆపేసింది.కాంట్రాక్టర్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. .. రీ టెండరింగ్ కు నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ప్రభుత్వం తీసుకున్న పోలవరం రీ టెండర్ల నిర్ణయంపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అయినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు.