హెలీకాప్టర్ లో కరోనా గర్భిణి ప్రసవం

  • Published By: nagamani ,Published On : September 2, 2020 / 11:19 AM IST
హెలీకాప్టర్ లో కరోనా గర్భిణి ప్రసవం

కరోనా వైరస్ సోకిన ఒక గర్భిణి హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా..పురిటి నొప్పులు పెరగటంతో ఆమె హెలికాప్టర్‌లో ప్రసవించింది. ఇటలీలోని దక్షిణ ఇటాలియన్ లాంపెడూసా ద్వీపంలోని ఒక వలస శిబిరంలో ఉన్న ఆమెను మంగళవారం (సెప్టెంబర్ 1,2020) ఆసుపత్రికి తీసుకెళ్తుండగా హెలికాప్టర్‌లోనే ప్రసవించింది.



కాగా..ఆఫ్రికా దేశాల నుంచి ఇటలీకి వలసదారులు పోటెత్తుతున్నారు. సముద్ర మార్గంలో వస్తున్న వలసదారులకు ఆశ్రయం ఇవ్వాలని ఐరాస సూచించడంతో ఇటలీ దానికి అనుమతినిచ్చింది. దీంతో 2020లో ఇప్పటివరకు 19,400 మంది ఇటలీ చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020లో 40 వేల మందికిపైగా సముద్ర మార్గంలో యూరప్ చేరుకున్నారని ఐరాస లెక్కలు చెబుతున్నాయి.
https://10tv.in/a-new-study-suggests-covid-19-reinfection-is-possible-heres-what-to-know/
మధ్యధరా సముద్రంలో వలసదారులతో వస్తున్న ఓడలను కొన్ని రేవులకు అనుమతించకపోవడంతో చిక్కుకుపోయినవారూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు.వారిని అనుమతించాలని ఐరాస సూచిస్తుండడంతో కొన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి.



ఆ క్రమంలోనే ఇటలీ ఏర్పాటు చేసిన శిబిరం నుంచి దాదాపు 100మందిని హెలీకాప్టర్ లో తరలించేందుకు ఏర్పాట్లు చేయగా కరోనా సోకిన గర్భిణిని హెలికాప్టరులో ఆమెను లాంపెడూసా నుంచి పాలెర్మోకు తీసుకెళ్లాలనుకున్నారు. ఈక్రమంలోనే ఆమెకు పురిటినొప్పులు రావటంతో హెలికాప్టర్ లో సిసిలియన్ రాజధాని పలెర్మోలోని సెర్వెల్లో ఆస్పత్రికి తరలిస్తుండగా…ఆమె హెలికాప్టర్ లోనే ప్రసవించింది. దీంతో తల్లీ బిడ్డను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.